Movies' R R R ' 24 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్లు......

‘ R R R ‘ 24 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్లు… ఇంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచ‌నాలు ఉన్నాయి. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డం ఒక ఎత్తు అయితే… టాలీవుడ్‌లోనే తిరుగులేని క్రేజీ స్టార్లుగా ఉన్న ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన మ‌ల్టీస్టార‌ర్ కావడంతో మామూలు హైప్ లేదు.

ఎట్ట‌కేల‌కు త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 24 రోజులు పూర్తి చేసుకుంది. ఓ వైపు కేజీయ‌ఫ్ 2 ప్రభంజ‌నం కంటిన్యూ అవుతున్నా కూడా.. దానిని త‌ట్టుకుని మ‌రి త్రిబుల్ ఆర్ డీసెంట్ వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 24 రోజుల‌కు ప్ర‌ప‌చం వ్యాప్తంగా వ‌చ్చిన వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 109.67 కోట్లు / రూ. 70 కోట్లు
సీడెడ్ – రూ. 50.05 కోట్లు / రూ. 37 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 34.21 కోట్లు / రూ. 22 కోట్లు
ఈస్ట్ – రూ.15.81 కోట్లు / రూ. 14 కోట్లు
వెస్ట్ – రూ. 12.93 కోట్లు / రూ. 12 కోట్లు
గుంటూరు – రూ. 17.77 కోట్లు / రూ. 15 కోట్లు
కృష్ణా – రూ. 14.31 కోట్లు / రూ. 13 కోట్లు
నెల్లూరు – రూ. 9.09 కోట్లు / రూ. 8 కోట్లు
———————————————————————-
ఏపీ + తెలంగాణ = రూ. 263.84 కోట్లు (రూ. 398.10 కోట్లు)
———————————————————————-

ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమాకు రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ రెండు ప్రాంతాల నుంచే రు. 263 కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే రు. 70 కోట్ల‌కు పైగా లాభం వ‌చ్చింది. ఒక్క నైజాంలోనే దిల్ రాజు ఈ సినిమాను రు. 70 కోట్ల‌కు తీసుకుంటే అక్క‌డ రు. 40 కోట్ల లాభం వ‌చ్చింది. ఇది మామూలు విజ‌యం కాదు.ఇక సీడెడ్‌లోనూ రు. 13 కోట్లు లాభాలే వ‌చ్చాయి.

అయితే ఈస్ట్‌, వెస్ట్ లాంటి చోట్ల మాత్ర‌మే త‌క్కువ మార్జిన్‌తో భ‌య‌ట ప‌డ్డారు. ఉత్త‌రాంధ్ర‌లోనూ రు. 12 కోట్ల లాభాలు అంటే మామూలు విష‌యం కాదు. ఇక త్రిబుల్ ఆర్ 24 రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 572.48 కోట్ల షేర్ రాబట్టింది. హిందీలో రూ. 124.60 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళ్లు చేసింది.

అన్ని ఏరియాల‌కు క‌లిపి త్రిబుల్ ఆర్ ను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 133.04 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌ అందుకుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news