Moviesపాత కారు ఎక్కుతారా... కొత్త కారు ఎక్కుతారా అని ఎన్టీఆర్ అడిగితే.....

పాత కారు ఎక్కుతారా… కొత్త కారు ఎక్కుతారా అని ఎన్టీఆర్ అడిగితే.. సినారే ఏం చేశారో చూడండి..!

హీరోగా ఎన్టీవోడు టాప్ గేర్ లో ఉన్న రోజులు అవి., రోజుకి రెండు షిఫ్ట్ లు షూటింగ్ చేసేవారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఏ హీరో కూడా డైరెక్షన్ గురించి ఆలోచన కూడా చేయరు… కానీ ఈ ఎన్టీఆర్ అందరి కంటే భిన్నంగా ఆలోచించేవాడు. స్వీయ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం “సీతారామ కళ్యాణం” నిర్మించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో ద్వితీయ సినిమాగా జానపదకథలను ఎంచుకున్నారు. అయితే అది తెలుగు జానపదకథ కాదు పర్షియా దేశంలో బాగా ప్రచారంలో ఉన్న ఓ జానపదకథ గులేభకావలికథ ఆధారంగా తీసింది. అయితే గులే అంటే పువ్వు భకావలి అంటే ఒక మహిళ పేరు, ఆమె దగ్గర ఉండే ఒక పూవ్వు సకల రోగాలను కుదర్చగలదు.

అయితే రాజకుమారుడు అయిన హీరో తన తండ్రి అంధత్వాన్ని పోగొట్టటానికి ఆమెని మెప్పించి ఆమె దగ్గరనుండి ఆ పువ్వును సంపాదించటమే కథ సారాంశం. అచ్చం అలాగే 1939లో ఈ కథ ఆధారంగా అదే పేరుతో పంజాబ్ లో ఒక చిత్రం వచ్చింది. దానికంటే ఓ ఏడాది ముందు అంటే 1938లో కాళ్ళకూరు సదాశివరావు దర్శకత్వంలో గులేభకావలి చిత్రాన్ని పారా మౌంట్ పిక్చర్స్ అధినేత కికుభాయ్ దేశాయ్ నిర్మించారు. ఆ తరువాత 1955లో దర్శక నిర్మాత టిఆర్.రామన్ ఎంజీఆర్ హీరోగా గులేభకావళి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రాణి నకావాలిగా వరలక్ష్మి నటించారు. ఆ చిత్ర కథకు కొన్ని మార్పులు జోడించి 7 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ లో గులేభకావలి కథ చిత్రాన్ని నిర్మించారు.

అయితే తమిళ సినిమా ముస్లిం వాతావరణంలో జానపధకథగా ఉంటుంది. తెలుగు సినిమా హిందూ వాతావరణంలో మంత్రాలూ, మాటలతో నడుస్తుంది. తెలుగులో విలన్ పాత్రను కొత్తగా చేర్చారు. గుండమ్మ కథ చిత్ర నిర్మాత చక్రపాణి గారు వీళ్ళ ముగ్గురి మధ్య రాజీ కుదిర్చారు. దాని ప్రకారమే గుండమ్మకథ చిత్రంలో అక్కినేని సరసన నటించారు జమున. అలాగే గులేభకావలి చిత్రంలో జమునను తీసుకుని కథలోని వేశ్య పాత్రను మార్చేశారు ఎన్టీఆర్. అయితే జమున పాత్ర పేరు యుక్తిమతి. విజయ సంస్థ నిర్మించిన జగదీకవీరుని కథ అలాగే గులేభకావలికథ రెండు కూడా జానపదకథలే. రెండింటిలో కూడా ఎన్టీఆర్ హీరో పాత్రను చేసారు.

ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్ వేసేటప్పుడు ఎన్టీఆర్ ఓ సరికొత్త ప్రయోగం చేశారు. ఒక అస్థిపంజరం అటు ఇటు తన చేతులను ఆడిస్తుంటే మధ్యలో టైటిల్స్ రావటం అప్పట్లో ఒక విచిత్రంగా చెప్పుకున్నారు ప్రేక్షకులు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ అస్థిపంజరంతో చేసే ఫైట్ సీన్స్ చూసి ప్రేక్షకులు ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారు. గీత రచయితగా సి నారాయణ రెడ్డికి ఇది తొలి సినిమా. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. హైదరాబాద్ నుండి ట్రైన్ లో చెన్నై వస్తున్న‌ నారాయణ రెడ్డిని తీసుకురావటానికి ఎన్టీఆర్ స్వయంగా వెళ్లారు.

తనవెంట రెండు కార్లు ఉన్నాయి బ్రదర్ ఒకటేమో నేను పరిశ్రమలోకి వచ్చాక కొన్న కారు.. చాలా చిన్నగా ఉంటుంది. కానీ బాగా కలిసి వచ్చింది. రెండోది నేను సెటిల్ అయ్యాక కొన్న కొత్త కారు మీరు ఏ కారులో వస్తారు అని అడిగారు. దానికి నీ సెంటిమెంట్‌నే, నా సెంటిమెంట్ అని ఓల్డ్ కారు ఎక్కి వెళ్లి ఎన్టీఆర్ ఇంట్లో 10 రోజులపాటు ఉండి… రోజుకో పాట చొప్పున 10 పాటలు రాసేశారు నారాయణ రెడ్డి. 1962 జనవరి 5 న గులేభకావలికథ విడుదల అయ్యి ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది. అప్ప‌ట్లో ఆ టేకింగ్ చాలా థ్రిల్ ఇచ్చింది. 6 కేంద్రాల్లో 100రోజులు ఆడింది. అయన దర్శకత్వం చేసిన 16 సినిమాలలో గులేభకావలికథ సినిమా కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news