Moviesఆ డైరెక్టర్ ను బూతులు తిడుతున్న పూజా హెగ్డే..మరీ అంత దారుణమా..?

ఆ డైరెక్టర్ ను బూతులు తిడుతున్న పూజా హెగ్డే..మరీ అంత దారుణమా..?

పూజా హగ్దే..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. పొడుగుకాళ్ల సుదరిగా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ బ్యూటీ..అల్లు అర్జున్ సరసన డీజే మూవీ లో నటించి తన జాతకాన్ని మార్చుకుంది. ముఖ్యంగా ఈ మూవీ హాట్ బికినీ షో చేసి అందర్నీ తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం..అవన్నీ సూపర్ హిట్ కావడం తో అమ్మడు బిజీ అయ్యింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే టాప్ ప్లేస్ లో ఉంది. అల వైకుంఠపురములో సినిమా ద్వారా స్టార్ స్టేటస్ అందుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత వెనుతిరిగి చూడడం లేదు. ప్రెసెంట్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది.రీసెంట్ గా అమ్మడు నతించిన రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టినా..పూజా అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కాగా, ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి బీస్ట్ అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కబోతుందన్న సంగతి తెలిసిందే. కాగా, నిన్న ఉగాది సంధర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అభిమానుల ఊహకందని ఎన్నో విషయాలను ఈ ట్రైలర్ లో చూయించాడు డైరెక్టర్. ట్రైలర్‌లో విజయ్ దుమ్ములేపేశాడు. వీర రాఘవన్ పాత్రలో సైనికుడిగా విజయ్ అదరగొట్టేశాడు. విజయ్ యాక్షన్ సీక్వెన్స్, వాటిని తెరకెక్కించిన తీరు, స్టైలీష్ మేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. అంతా బాగానే ఉన్నా..ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ పూజా కెవలం ఒక్క షాట్ లోనే కనిపిస్తుంది. అదికూడా సెకండ్ అంతే..అలా కనిపించి ఇలా మాయమౌతుంది. పూజా లాంటి అందాల హీరోయిన్ ని ట్రైలర్ లో హాట్ గా చూయించి సినిమా పై ఇంకా బజ్ క్రియేట్ చేయచ్చు.

కానీ ఆమెకు ట్రైలర్ లో ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో పూజా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దాదాపు మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌లో ఒకే ఒక్క షాట్, ఒకే ఒక్క సెకన్ పూజా హెగ్డే కనిపిస్తుంది. అంటే అది ఎంత దారుణం. పేరుకే ఇందులో హీరోయిన్ ఉందని ఇట్టే చెప్పేసినట్టు అర్థమవుతోంది. ఇక పై పూజా కూడా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సన్నిహితుల వద్ద ఆ డైరెక్టర్ ని బూతులు తిడుతుందట. సినిమా ఒకే చేసే వరకు ఒకలా..సినిమా అయిపోయాక మరోకలా ఉంటారు ఈ డైరెక్టర్స్ అంటూ మండిపడుతుందట. మొత్తానికి ఇందులో పూజా హెగ్డే మాత్రం ఆటలో అరటి పండులా మిగిలిపోతుందని నవ్వుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news