Moviesబ్రేకింగ్: RRR సింగర్ అరెస్ట్.. అర్ధరాత్రి అడ్డంగా బుక్కైయాడుగా ..?

బ్రేకింగ్: RRR సింగర్ అరెస్ట్.. అర్ధరాత్రి అడ్డంగా బుక్కైయాడుగా ..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే నిజం అని తెలుస్తుంది. కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించి..బిగ్ బాస్ విన్నర్ గా నిల్చోబెట్టిన బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ ..పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నే అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.

గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. ఇక ఈ దాడుల్లో రాహుల్ సింప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. కాగా బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా రాహుల్ సింప్లిగంజ్ బాగా ఫెమస్ అయ్యారు. హౌస్ లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాళం లవ్ ట్రాక్ ఫుల్ ఫేమస్ అయ్యింది. వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాన్స్ బాగా హెల్ప్ అయ్యింది. గత సీజన్ విన్నర్ గా నిలిచిన రాహుల్, హౌస్ నుండి పునర్నవి ఎలిమినేటైనప్పుడు తెగ ఫీలైపోయాడు. ఎలిమినేటైన పునర్నవి సైతం రాహుల్ విన్నర్ కావడం కోసం భారీ క్యాంపైన్స్ చేసింది. రాహుల్ గెలవడంతో ఆమె ఉబ్బితబ్బిబయ్యింది. బయటకు వచ్చక పెళ్లి చేసుకుంటారు అనుకున్నారంతా ..కానీ Scene రీవర్స్ అయ్యింది.

ఇక రీసెంట్ గా RRR లో నాటు నాటు పాట పాడి మరోసారి తన టాలెంట్ ఏంటో చూయించాడు జనాలకు. అంతేకాదు రాహుల్ ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో రోల్ లో రాహుల్ నటించనున్నాడు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో శివాత్మిక జోడీగా రాహుల్ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి క్యారెక్టర్స్ సినిమాకే పెద్ద అసెట్ అవుతాయని తెలుస్తోంది. మొత్తానికైతే రాహుల్ కెరీర్ పీక్స్ వెళ్తున్న టైలో ఇలా పోలీసుల అదుపులో ఉండటం ..ఆయన కి Bad Name తీసుకొస్తుందంటున్నారు సినీ విశ్లేకషకులు.సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. అంచెలంచెలుగా తన పాపులారిటీ పెంచుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news