Moviesప్రేమ‌లో ఫెయిల్యూర్ అయ్యి 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు...!

ప్రేమ‌లో ఫెయిల్యూర్ అయ్యి 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు…!

జీవితంలో ఎవ‌రికి అయినా పుట్టుక‌, చావుతో పాటు పెళ్లి అనేది కూడా ముఖ్య‌మైంది. పెళ్లి అనేది మ‌న జీవితంలో మ‌రో వ్య‌క్తి తోడ‌వ్వ‌డంతో పాటు ఆ తోడుతో క‌డ‌వ‌ర‌కు క‌లిసి మెలిసి ఉంటాడు. పెళ్లి త‌ర్వాత దాంప‌త్య జీవితం మొద‌ల‌వ్వ‌డంతో పాటు జీవితాంతం భార్య‌భ‌ర్త‌లుగా ఒక‌రికి మ‌రొక‌రం తోడుగా ఉంటామ‌న్న అనుభూతితో ఈ కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు.

ఇక సినిమా సెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే హీరోయిన్లు 40 ఏళ్లు దాటుతున్నా పెళ్లి చేసుకోవ‌డం లేదు. కొంద‌రు హీరోయిన్లు ముదురు వ‌య‌స్సు వ‌చ్చినా కూడా ఇంకా సినిమాల్లో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. అనుష్క‌, న‌య‌న‌తార‌, త్రిష‌, చార్మీ కౌర్‌, త‌మ‌న్నా ఇలా మంది హీరోయిన్లు ముదురు ముద్దుగుమ్మ‌లుగానే ఉన్నారే త‌ప్పా పెళ్లి అన్న మాటే అన‌డం లేదు.

అయితే ఈ త‌రం కంటే ముందు పాత త‌రంలో కొంద‌రు హీరోయిన్లు 40 ఏళ్లు దాటేసి… నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా పెళ్లి గిళ్లీ అన్న మాట లేకుండా ఉండిపోయారు. వీరిలో కొంద‌రు హీరోయిన్లు ప్రేమ‌లో ఫెయిల్ అవ్వ‌డంతోనే పెళ్లికి దూర‌మైపోయార‌ని అంటారు. అమ్మ‌మ్మ వ‌య‌స్సు వ‌చ్చేసినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంట‌రి జీవితం గ‌డుపుతోన్న ఆ హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

ట‌బు :
ఒక‌ప్పుడు క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ట‌బు సౌత్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలిగింది. ట‌బు స్వ‌త‌హాగా హైద‌రాబాదీ అమ్మాయే. ఆమె పుట్టింది.. పెరిగింది ఇక్క‌డే. ఆమె అక్క ఫ‌రా కూడా హీరోయినే. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తోన్న ట‌బు వ‌య‌స్సు 48 ఏళ్లు. ఆమె హైద‌రాబాద్‌లోనే కాలం గ‌డుపుతోంది. ట‌బు ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున‌ను ట‌బు పిచ్చిగా ప్రేమించింది. నాగ్‌కు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. అయితే అప్ప‌టికే నాగ్‌కు అమ‌లో పెళ్ల‌య్యింది. అటు నాగ్‌ను మ‌ర్చిపోలేక‌.. మ‌రొక‌రిని పెళ్లాడ‌లేక ట‌బు అలాగే ఉండిపోయింది.

శోభన :
మ‌ళ‌యాళ డ్యాన్స‌ర్ అయిన శోభన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఇచ్చింది. ఆ తరవాత హీరోయిన్‌గా తెలుగుతో పాటు సౌత్‌లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున‌, మోహ‌న్‌బాబు లాంటి స్టార్స్ ప‌క్క‌న ఆమె న‌టించింది. న‌ట‌న ప‌రంగాను, భర‌తనాట్యంలోనూ శోభ‌న అభిన‌యం అదుర్స్‌. 50 ఏళ్లు దాటిన ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకుని భ‌ర‌త నాట్యం డ్యాన్స‌ర్‌గా కాలం గ‌డిపేస్తోంది. ఆమె ఓ మ‌ళ‌యాళ హీరోతో ప్రేమ‌లో ప‌డి ఫెయిల్ అయ్యింద‌ని.. ఆ త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి అనే ప‌దానికే దూర‌మైపోయింద‌ని అంటారు.

నగ్మా :
ఒక‌ప్పుడు సౌత్ టు నార్త్ ఇండ‌స్ట్రీని ఏలేసింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. న‌గ్మాను ముద్దుగా అరేబియ‌న్ గుర్రం అని పిలుచుకునే వారు. తెలుగులో కూడా ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. అయితే ఆమె ప్రేమాయ‌ణాలు చాలానే ఉన్నాయి. సౌత్‌లో ఉన్న‌ప్పుడు కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్‌ను పిచ్చిగా ప్రేమించింది. ఆ త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీతో ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రు సీక్రెట్‌గా పూజ‌లు కూడా చేశారు. ఆ త‌ర్వాత భోజ్‌పురి స్టార్స్ ర‌వికిష‌న్ సింగ్‌, మ‌నోజ్ తివారి సైతం ఆమెతో కొంత కాలం డేటింగ్‌లు చేసిన‌ట్టు టాక్ ? ఇప్పుడు 50 ఏళ్లు దాటుతున్నా న‌గ్మా పెళ్లి అన్న మాటే మాట్లాడ‌డం లేదు.

సితార :
సితార అంటే ఆ త‌రం ప్రేక్ష‌కుల్లో ఆమెకు స‌ప‌రేట్‌గా అభిమానులు ఉండేవారు. ఆమె అందం, అభిన‌యం ఓ వ‌ర్గం వారిని బాగా ఆక‌ట్టుకునేది. సితార సాంగ్ కూడా ఇప్ప‌ట‌కీ ఎంతో పాపుల‌ర్‌. ప్ర‌స్తుతం సినిమాల్లోనూ, సీరియ‌ల్స్‌లోనూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సితార 50 ఏళ్ల‌కు చేరువ అవుతున్నా కూడా పెళ్లి చేసుకోలేదు. త‌న స‌హ‌న‌టుడు ముర‌ళీతో ప్రేమ‌, పెళ్లి పెటాకులు కావ‌డంతోనే సితార పెళ్లికి దూరంగా ఉంద‌ని అంటారు.

కౌసల్య :
పంచదార చిలక సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ కౌసల్య. కౌస‌ల్య ఒకానొక టైంలో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత సీరియ‌ల్స్‌కు షిఫ్ట్ అయ్యింది. కౌస‌ల్య వ‌య‌స్సు 40 దాటేసింది. ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఓ న‌టుడికి మ‌న‌స్సు ఇవ్వ‌డం.. అత‌డు ఆమెకు హ్యాండ్ ఇవ్వ‌డంతోనే ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లికి దూరంగా ఉంద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news