Moviesహీరోయిన్ కీర్తిరెడ్డి తమ్ముడు కూడా హీరోనే.. ఇంతకీ ఎవరో తెలుసా..?

హీరోయిన్ కీర్తిరెడ్డి తమ్ముడు కూడా హీరోనే.. ఇంతకీ ఎవరో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కీర్తిరెడ్డి ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. అస‌లు కీర్తిరెడ్డి ఎన్ని సినిమాలు చేసిందో కూడా ఎవ్వ‌రికి గుర్తు ఉండ‌దు. అయితే ఆమెను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోకుండా చేసిన సినిమా మాత్రం ఒక్క‌టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించింది కీర్తిరెడ్డి. ఇక ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదగడానికి తొలిప్రేమ విజయమే కార‌ణం.

తొలిప్రేమ సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న కీర్తిరెడ్డి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా కట్టిపడేసింది. ఆ త‌ర్వాత తెలుగులో ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు రాక‌పోవ‌డంతో ఇక్క‌డ రాణించ‌లేక‌పోయింది. నాగార్జున రావోయి చంద‌మామ సినిమాలో న‌టించింది. ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ చెక్కెసింది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్లో రెండు మూడు సినిమాల్లో నటించిన కీర్తిరెడ్డి మళ్లీ టాలీవుడ్ కి మకాం మార్చింది. కానీ ఈమెకు ఆ తర్వాత మాత్రం అవకాశాలు తక్కువగానే వచ్చాయి. చివరగా మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు అని చెప్పాలి. ఇక అర్జున్ సినిమా తర్వాత అక్కినేని హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో యేడాదికే విడిపోయారు.

విడాకుల తర్వాత కీర్తి రెడ్డి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. కీర్తి రెడ్డి తమ్ముడు కూడా సినిమాల‌లో హీరోగా నటించాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కీర్తి రెడ్డి తమ్ముడు ఎవరు అని అంటారా ? ఇంకెవరో కాదు మనందరికీ తెలిసిన సామ్రాట్ రెడ్డి. సామ్రాట్ రెడ్డి నటించిన కొన్ని సినిమాలు అంతగా క్లిక్ కాలేదు.

అయితే ఆహనా పెళ్ళంట లాంటి సినిమాల్లో మంచి పేరు తీసుకు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాక‌పోవ‌డంతో ఎప్పుడో ఒక‌ప్పుడు ఏదో ఒక సినిమా త‌న‌కు బ్రేక్ తీసుకు రాక‌పోతుందా ? అని వెయిట్ చేస్తూ వ‌స్తున్నాడు. అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు సామ్రాట్ రెడ్డి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news