Moviesబ‌ర్త్ డే రోజున అభిమానుల‌కు బాల‌య్య రివ‌ర్స్ గిప్ట్.. డబుల్ ట్రీట్..గెట్...

బ‌ర్త్ డే రోజున అభిమానుల‌కు బాల‌య్య రివ‌ర్స్ గిప్ట్.. డబుల్ ట్రీట్..గెట్ రెడీ..!!

జూన్ 10.. న‌ట‌సింహ నంద‌మూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆయ‌న అభిమానుల‌కు అది పండుగ రోజు. ఆ రోజు కోసం బాలయ్య అభిమానులు సంవత్సరం పొడువునా ఎదురుచూస్తుంటారు. ఇక బాలయ్య కూడా అదేరోజు త‌న ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక అందిస్తూ వస్తుంటారు. ప్రతిసారి లాగే ఈసారి కూదా బాలయ్య అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ రెడీ చేసిన్నట్లు తెలుస్తుంది. పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు అద్దిరిపోయే ట్రీట్ అందించబోతున్నారు బాల‌య్య‌.

బ‌ర్త్ డే సంద‌ర్భంగా తన కొత్త చిత్రం నుంచి ఓ సర్​ప్రైజ్​ ఇవ్వ‌నున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 107వ చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మల్లినేను దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ మూవీ టైటిల్‌, హీరోయిన్ తో ఫస్ట్‌లుక్‌తో పాటు ఓ పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది​. నిజంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చే న్యూసే అవుతుంది. అంతేకాదు, బాలయ్య అభిమానుల కోసం మరో సర్ ప్రైజ్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో..కూడా ఓ సినిమా కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి సంబంధించి అఫిషియల్ న్యూస్ అయితే బయటకు రాలేదు. ఇక బాలయ్య బర్తడే నాడు ఆ తీపి కబురును అనౌన్స్ చేస్తూ.. అనిల్ రావిపూడితో తాను చేయబోయే సినిమా సంగతులను ఆరోజే రివీల్ చేయబోతున్నారట బాలయ్య. బాలయ్య 108వ సినిమా కోసం ఇప్పటికే అనిల్ ఓ ఫెంటాస్టిక్ స్టోరీని రెడీ చేసిన్నత్లు టాక్ వినిపిస్తుంది. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ మోస్ట్ పూర్తయినట్టే. ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ ను జూన్ 10న ప్రకటించేసి సెప్టెంబర్ లో మొదలుపెట్టాలనుకుంటున్నారట అనిల్. సో,, ఈసారి బాలయ్య బర్తడే ట్రీట్ మామూలుగా ఉండదనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news