Moviesఆ యంగ్ హీరోని చీట్ చేసిన సుకుమార్..అస్సలు క్యారెక్టర్ ఇదా..?

ఆ యంగ్ హీరోని చీట్ చేసిన సుకుమార్..అస్సలు క్యారెక్టర్ ఇదా..?

లెక్కల మాస్టర్ సుకుమార్.. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చలామణీ అవుతున్నాడు. సుకుమార్ తో సినిమా అంటే అది మామూలూ విషయం కాదు. దానికీ భీభత్సంగా ఎక్కడో లక్ ఉండాలి. అలాంటి హీరోలతోనే ఆయన సినిమా తెరకెక్కిస్తాడు. ఈ మధ్యనే అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ను తెరకెక్కించిన ఈయన .. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతోనే సుకుమార్ తమిళ-హింది-మలయాళ భాషలల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

ప్రజెంట్ పుష్ప 2 ను తెరకెక్కించే పనిలో ఉన్న సుకుమార్.. ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా షూటింగ్ ను వెనక్కి వెనక్కి పోస్ట్ పోన్ చెసుకుంటూ పోతున్నారు. మధ్యలో చిరంజీవి తో ఒక్క యాడ్ షూట్ చేసిన సుకుమార్.. ఇప్పుడు ఆయన కోసం ఓ యంగ్ హీరో తో కమిట్ అయిన సినిమాను కూడ క్యాన్సిల్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. యస్.. ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సుకుమార్..రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా కు కమిట్ అయ్యి ఉన్నాడట. పూరీ తో జనగణమన షూటింగ్ చేస్తూనే ..సుకుమార్ తో కమిట్ అయిన సినిమా ను కంప్లీట్ చేసే ప్లాన్ వేసుకున్నారట విజయ్.

కానీ, ఇప్పుడు తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ విజయ్ సినిమా ని క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..ఆ లైన్లో కి మెగాస్టార్ చిరంజీవి వచ్చారట. పుష్ప 2 సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నత్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆ వెంటనే మళ్ళీ చరణ్ తో రంగస్ధలం 2 తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఆఫర్ల కోసం సుకుమార్ విజయ్ ని వదిలేశాడా.. సుకుమార్ ఇలాంటి వాడా అంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీని పై సుకుమార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news