Moviesరు. 1000 కోట్ల RRR... ఇండియా రికార్డులే కాదు ప్ర‌పంచ రికార్డులే...

రు. 1000 కోట్ల RRR… ఇండియా రికార్డులే కాదు ప్ర‌పంచ రికార్డులే బ్రేక్‌..!

హ‌మ్మ‌య్యా త్రిబుల్ ఆర్ వ‌చ్చేసింది. ఈ యేడాది భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ టాక్‌తో దూసుకుపోయింది. బాహుబలి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు. మూడు రోజుల‌కు ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లోనే ఏకంగా 9.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు సాధించింది. అస‌లు ఈ జోరుకు ఎక్క‌డ బ్రేకులు ప‌డ‌తాయో కూడా అర్థం కావ‌డం లేదు. ఇక 3 రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ రు. 500 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇక త్రిబుల్ ఆర్ దూకుడు చూస్తుంటే మూడు రోజుల్లో రు. 500 కోట్ల వ‌సూళ్లు అంటే ఇది భార‌త‌దేశంలో విడుద‌ల అయిన ఏ సినిమాకు అయినా రికార్డుగానే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ రికార్డు కేవ‌లం ఇండియా రికార్డు కాదు.. ఇండియా బ‌య‌ట ఫ‌స్ట్ వీకెండ్‌లో ఏ భార‌తీయ సినిమా క్రియేట్ చేయ‌ని రికార్డు సైతం సాధించిన గొప్ప సినిమా అని చెప్పాలి.

సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా రాజ‌మౌళి మాత్రం సినిమా క‌లెక్ష‌న్లు మాట్లాడ‌తాయంటూ ముందు నుంచి ధీమాతో ఉన్నారు. ఈ రోజు అదే ఫ్రూవ్ అయ్యింది. ఇక RRR సోమవారం పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇక వ‌చ్చే వారం కూడా ఈ సినిమాకు పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఇక ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 వ‌చ్చే వ‌ర‌కు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను.. ఇటు సౌత్ బాక్సాఫీస్‌ను.. అటు ఓవ‌ర్సీస్‌ను త్రిబుల్ ఆర్ ఏక‌చ‌క్రాధిప‌త్యంతో ఏలేయ‌వ‌చ్చు.

ఇదే రేంజ్‌లో ఈ సినిమా వ‌సూళ్లు సాధిస్తే ఫ‌స్ట్ వీకెండ్ నాటికే త్రిబుల్ ఆర్ రు. 1000 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవ‌కాశం ఉంది. ఏదేమైనా లాంగ్ ర‌న్‌లో బాహుబ‌లి 2 రికార్డుల‌ను త్రిబుల్ ఆర్ బీట్ చేస్తుందా ? లేదా ? అన్న‌దే చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news