MoviesOfficial: అభిమానులకు కేకపెట్టించే అప్డేట్..ప్రభాస్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌..!!

Official: అభిమానులకు కేకపెట్టించే అప్డేట్..ప్రభాస్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌..!!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా గదిపేస్తున్నాడు. ఈ సినిమా మరి కొన్ని గంటల్లో పేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ భాషలో సినిమా హిట్ అవ్వాలని ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తు్న్నారు ప్రభాస్. ఎప్పుడో సాహో తో ధియేటర్స్ లో కనిపించిన డార్లింగ్ మళ్లీ ఇన్నాళ్లకి తెర పై కనిపించనుండడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాతో రికార్డులు తిరగరాయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తన అప్‌కమింగ్ సినిమా విశేషాలను కూడా పంచుకుంటున్నాడు ప్రభాస్.

ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా “సలార్” గురించి అద్దిరిపోయే న్యూస్ ని లీక్ చేశాడు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా ‘ఉగ్రమ్’ కన్నడ చిత్రానికి రీమేక్​ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలసిఉంది. ఇక ఈ సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తను రివీల్ చేశాడు ప్రభాస్.

ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వచ్చినా దాని పై అధికారిక ప్రకటనలేకపోవడంతో..అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ..మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సలార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని చెప్పేశాడు. దీంతో అభిమానులకు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చిన్నట్లైంది. పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాలీవుడ్ లో ఆల్ రౌండర్ గా ఓ వెలుగు వెలిగిపోతున్నాడు.

కాగా పృథ్వీరాజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఆ పాత్ర చేస్తున్నందుకు గానూ పృథ్వీరాజ్‌కు ప్రభాస్‌ కృతజ్ణతలు తెలిపాడు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్​రూర్​ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘సలార్‌’ చిత్రం తప్పకుండా అన్ని భాషల్లోనూ పెద్ద సక్సెస్ అవుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన శ్రుతి హాసన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news