Moviesజ‌న‌తా గ్యారేజ్‌లో మోహ‌న్‌లాల్ పాత్ర‌కు బాల‌య్య‌ను అందుకే తీసుకోలేదా.. కొర‌టాల చెప్పిన...

జ‌న‌తా గ్యారేజ్‌లో మోహ‌న్‌లాల్ పాత్ర‌కు బాల‌య్య‌ను అందుకే తీసుకోలేదా.. కొర‌టాల చెప్పిన కార‌ణం ఇదే..!

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 2016 సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్ క్లాస్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అదే ఏడాది దసరాకు జనతా గ్యారేజ్ వచ్చి ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా రెండో హిట్ నమోదు చేసింది. గత కొన్ని సంవ‌త్స‌రాల్లో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు చేసి.. ఆ రెండూ కూడా హిట్ అయ్యింది 2016లో మాత్రమే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్ల‌లో చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఎన్టీఆర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే సమంత, నిత్య మీనన్ నటనకు తోడు దర్శకుడు కొరటాల శివ టేకింగ్ తో పాటు మంచి సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ను నటింపజేసేందుకు కొరటాల శివ ప్రత్యేకంగా కొచ్చీ వెళ్లారట. కథ విన్న వెంటనే మోహన్ లాల్ చాలా మంచి పాత్ర ఇది వెంటనే చేసేద్దాం అని చెప్పేశారట.

 

అయితే ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివకు ఈ పాత్ర బాలకృష్ణతో చేయించి ఉంటే సినిమా వేరేగా ఉండేది కదా ? అన్న ప్రశ్న ఎదురయింది. అప్పుడు స్పందిస్తూ అది భయంకరమైన కాంబినేషన్ అని చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని… ఈ కాంబినేషన్లో సినిమా ఉండాలి అంటే మరింత బలమైన కథ రాసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ… మోహన్ లాల్ పాత్ర చేయాల్సి వస్తే అప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను… సినిమాగా చూడకుండా పర్సనల్‌గా ఎన్టీఆర్ – బాలయ్య నిజజీవితంలో బాబాయి అబ్బాయి కావడంతో అలాగే ట్రావెల్ అవుతారని అప్పుడు సినిమాలో ఎగ్జైట్మెంట్ ఉండదని కొర‌టాల చెప్పాడు.

వాళ్ళిద్దరూ కలిసి నటించాలంటే అందుకు తగిన బలమైన క‌థ‌ తీసుకోవాలని చెప్పారు. ఇక కొరటాల ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా జనతా గ్యారేజ్ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. అలాగే బాలయ్యతో కూడా కొరటాల ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news