Moviesబాల‌య్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఉగాదికి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..!

బాల‌య్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఉగాదికి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ గ‌త యేడాది చివ‌ర్లో థియేట‌ర్ల‌లోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం రు. 200 కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమాగా అఖండ రికార్డుల‌కు ఎక్కింది. ఇప్పుడు బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అందాల నాయిక శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సైతం మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

ఇక క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ బాల‌య్య‌ను ఢీ కొట్టే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ముస‌ళ్ల మడుగు ప్ర‌తాప్‌రెడ్డిగా రిలీజ్ అయిన దునియా విజ‌య్ ఫ‌స్ట్ లుక్ భీక‌రంగా ఉంది. ఇటు బాల‌య్య అఖండ‌తో, అటు మ‌లినేని గోపీచంద్ క్రాక్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ సినిమా కూడా మాస్ జ‌నాల‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తుంద‌నే అంటున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల‌లో ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి బాల‌య్య ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉగాది పండుగ కానుక‌గా ఎన్బీకే 107 నుంచి బిగ్ స‌ర్‌ఫ్రైజ్ రాబోతోంద‌ట‌. అదే ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌. బాల‌య్య సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చిందంటే.. అది కూడా పండ‌గ రోజు అంటే మామూలు అరాచ‌కం కాదు.. అఖండ ఫ‌స్ట్ గ్లింప్స్ రోరింగ్‌గా రిలీజ్ అయ్యి ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం.

ఇక ఉగాది కానుక‌గా సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇక ఈ సినిమాలో బాల‌య్య డ్యూయెల్ రోల్లో న‌టిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. బాల‌య్య రెండు పాత్ర‌ల్లోనూ చాలా వేరియేష‌న్ ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌లినేని గోపీచంద్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news