MoviesRRR వామ్మో ఇదేం మాస్ ప్ర‌మోష‌న్‌రా బాబు.. తార‌క్ మాసీవ్ అరాచ‌కం...

RRR వామ్మో ఇదేం మాస్ ప్ర‌మోష‌న్‌రా బాబు.. తార‌క్ మాసీవ్ అరాచ‌కం (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు ఎంతో ఆసక్తిగా అవైటెడ్ గా ఎదురు చూస్తున్న సినిమా త్రిబుల్ ఆర్‌. ఒక‌టి కాదు రెండు కాదు నెల‌ల‌కు నెల‌లుగా.. మూడేళ్ల‌కు పైగానే ఈ సినిమా ఎప్పుడు థియేటర్ల‌లోకి వ‌స్తుందా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే రెండు, మూడుసార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా మొన్న సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉన్నా ఈ నెల 25వ తేదీకి వాయిదా ప‌డింది.

బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో పాటు అటు ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌న్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో అంచ‌నాలు అరాచ‌కం లెవ‌ల్లో ఉన్నాయి. అందుకు త‌గిన‌ట్టుగా ప్ర‌మోష‌న్లు చూస్తుంటూనే పిచ్చెక్కిపోయేలా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరాచ‌కం అయితే మామూలుగా లేదు.

ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ఎన్టీఆర్ అభిమానులు బ‌ల్క్‌గా టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. కొన్ని చోట్ల షోల‌కు షోలే బుక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆదిలాబాద్ జిల్లా మ‌న్యం వీరుడు కొమ‌రం భీం పాత్ర‌లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌న హీరోల‌కు తెలుగు గ‌డ్డ‌పైనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లో ఎలాంటి అభిమానం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

తాజాగా ఇప్పుడు ఓ విమానంతో “తొక్కుకుంటూ పోవాలే” అనే ఎన్టీఆర్ డైలాగ్ ని ఆకాశంలో ఎగరేసి మరీ తమ ప్రేమని చాటుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ మాసీవ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news