Moviesరాజ‌మౌళి బాల‌న‌టుడిగా న‌టించిన సినిమా మీకు తెలుసా...!

రాజ‌మౌళి బాల‌న‌టుడిగా న‌టించిన సినిమా మీకు తెలుసా…!

రాజమౌళి దర్శక ధీరుడు మాత్ర‌మే కాదు అంత‌కు మించి అన్న‌ట్టుగా ఇండియ‌న్ సినిమా హిస్టరీలో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఇమేజ్ ఎల్లులు దాటేసింది. ఆకాశం దాటేసి ఆ పైకు వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియ‌న్ సినిమా అంత‌టా తీవ్ర‌మైన ఉత్కంఠ రేపుతున్నాడు అంటే రాజ‌మౌళి అంటే ఇండియ‌న్ సినిమా జ‌నాల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో తెలుస్తోంది.

కేవలం బాహుబలి సీరిస్ సినిమాల‌తో రాజ‌మౌళి పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు అయిపోయాడు. ఇక రాజ‌మౌళి న‌టుడు అన్న విష‌యం త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. రాజ‌మౌళి పెద్ద డైరెక్ట‌ర్‌.. త‌న సినిమాల్లో హీరోల‌కు సీన్లు వివ‌రించే ట‌ప్పుడు రాజ‌మౌళి ఎలాగూ న‌టించి చూపిస్తాడు.. అది కాదు రాజ‌మౌళి ఒక సినిమాలో బాల‌న‌టుడిగానే వెండితెర‌పై క‌నిపించాడు అన్న‌ది చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

ఈ విష‌యాన్ని త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో రాజ‌మౌళియే స్వ‌యంగా వెల్ల‌డించాడు. రాజ‌మౌళి బాల‌న‌టుడిగా న‌టించిన సినిమా పేరు పిల్ల‌న గ్రోవి. 1983లో ఆ సినిమా షూటింగ్ జ‌రిగింది. అప్పుడు రాజ‌మౌళి వ‌య‌స్సు 10 సంవ‌త్స‌రాలు. అయితే రాజ‌మౌళి బ్యాడ్ ల‌క్ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఇంత కాలానికి రాజ‌మౌళి తాను బాల‌న‌టుడిగా క‌నిపించిన విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌దు.

ఒక‌వేళ రాజ‌మౌళి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి.. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఒక‌వేళ న‌ట‌న వైపు వెళ్లి ఉండే ఛాన్స్ వ‌చ్చేదేమో ? అని కూడా అభిప్రాయ ప‌డ్డాడు. ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి, ఎన్టీఆర్ మ‌ధ్య చిన్న స‌ర‌దా డిస్క‌ర్ష‌న్ న‌డిచింది. తాను సీనియ‌ర్ అంటే.. తాను సీనియ‌ర్ అని వాదించుకున్నారు. అప్పుడు రాజ‌మౌళి నువ్వు సినిమాల్లోకి రాక‌ముందే తాను సీరియ‌ల్ డైరెక్ట‌ర్‌ను అని రాజ‌మౌళి అన్నాడు.

వెంట‌నే ఎన్టీఆర్ అంత‌కంటే ముందు తాను బాల‌న‌టుడిగా న‌టించాన‌ని కౌంట‌ర్ వేశాడు. అందుకు రాజ‌మౌళి స్పందిస్తూ నీ కంటే ముందు నేను న‌టుడిని అని ఈ పిల్ల‌న‌గ్రోవి సీక్రెట్ బ‌య‌ట పెట్టాడు. అయితే ఇన్నాళ్ల‌కు ఈ విష‌యం ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news