Moviesబాల‌య్య‌.. మూడు ఇంట్ర‌స్టింగ్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు...!

బాల‌య్య‌.. మూడు ఇంట్ర‌స్టింగ్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు…!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసపెట్టి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకి కూడా ఓకే చెప్పారు. ఆ తర్వాత బాలయ్య లైనప్ లో సంపత్ నంది – తేజ లాంటి దర్శకులు కూడా ఉన్నారు.

బాలయ్య తరం స్టార్ హీరోలు అయిన నాగార్జున – వెంకటేష్ ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాలు చేశారు. చిరంజీవి కూడా మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణ సైతం మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బాగుంటుందని… కేవలం నందమూరి అభిమానులేనే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకుల మ‌దిలోనూ ఉన్నాయి. బాల‌య్య వ‌య‌స్సు ఇప్ప‌టికే ఆరు ప‌దులు దాటేసింది. ఈ వయసులో ఆయన మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఆయన కెరీర్ మరపురాని మధురానుభూతులను మిగిల్చిన‌ట్టు అవుతుందన్న అశ‌లు చాలామందికి ఉన్నాయి.

అయితే ఇప్పుడు బాలయ్య చుట్టూ ఒకటి కాదు…. రెండు కాదు ఏకంగా మూడు మల్టీస్టారర్‌లు ఉన్నాయి. వీటిలో ముందుగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రైటర్ విజయేంద్రప్రసాద్ హాలీవుడ్ జేమ్స్‌బాండ్ స్టైల్లో ఓ యాక్షన్ కథను రెడీ చేశారు. ఈ సినిమాలో సెకండాఫ్ లో 40 నిమిషాల పాటు బాలయ్య కోసం పవర్ ఫుల్ పాత్ర‌ను విజయేంద్రప్రసాద్ – రాజమౌళి కలిసి క్రియేట్ చేశారనే ప్రచారం గత నెల రోజులుగా జరుగుతుంది.

త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక కథ రిలాక్స్ అయిన వెంటనే మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి కసరత్తులు ప్రారంభించారు. ఈ లోగానే బాలయ్యను కలిసి క‌థ‌ చెబుతారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మహేష్ బాబు – బాలయ్య కలిసి నటిస్తే టాలీవుడ్ లో అంత‌కు మించిన సంచలనం మరొకటి ఉండదు. ఇక ఇటీవల బాలయ్య మెగా కాంపౌండ్ లో అల్లుఅరవింద్ కుటుంబానికి బాగా దగ్గర అయిపోయారు. ఆ హలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ టాక్ షో సూపర్ హిట్ అయ్యింది. దీంతో బాలయ్య హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా నిర్మించేందుకు అర‌వింద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

బాల‌య్య‌తో భ‌విష్య‌త్తు బంధం మ‌రింత స్ట్రాంగ్‌గా ఉండాల‌నే అర‌వింద్ కోరుకుంటున్నారు. బాలయ్య అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ సైతం హాజ‌రు కావ‌డంతో బాలయ్య – బన్నీ అభిమానులు కూడా వీరిద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్లో బోయపాటికి బాలయ్య – బ‌న్నీ కాంబినేషన్లో మీ నుంచి ఓ మల్టీ స్టారర్ సినిమా వస్తుందా ? అన్న ప్రశ్న ఎదురైంది. బోయ‌పాటి కూడా ఖ‌చ్చితంగా చేస్తాన‌ని చెప్పారు. ఇక ఆహా వాళ్లు అన్‌స్టాప‌బుల్‌ రెండో సీజన్ కూడా బాలయ్య హోస్ట్ గా జూలై నుంచి ప్రారంభిస్తున్నారు. టైం కుదిరితే బ‌న్నీ – బాల‌య్య సినిమా ఎప్పుడైనా ఉంటుంది.

ఇక ఫైన‌ల్‌గా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య‌కు ఈ ప్ర‌శ్న నేరుగానే ఎదురైంది. ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ ఉంటుందా ? అన్న ప్ర‌శ్న‌కు బాల‌య్య స్పందిస్తూ క‌థ కుదిరితే ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని.. అయితే అది క‌థ డిమాండ్ చేయాలే గాని… కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమా కోణంలో ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో బాల‌య్య – ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టారర్ ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. కొంద‌రు ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌ల‌పై క‌ళ్యాణ్‌రామ్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు అయినా ఉండే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news