Moviesరాధేశ్యామ్ సినిమాలో 3 అతిపెద్ద త‌ప్పులు.. సినిమాను ఇవే దెబ్బేశాయ్‌..!

రాధేశ్యామ్ సినిమాలో 3 అతిపెద్ద త‌ప్పులు.. సినిమాను ఇవే దెబ్బేశాయ్‌..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ ఈ రోజు భారీ అంచ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. అయితే సినిమాకు బాహుబ‌లి 1, 2 లాగా ఏం బ్లాక్‌బ‌స్ట‌ర్ రా అన్న టాక్ లేదు. పోనీ సాహోలా ప్లాప్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత పుంజుకునే అవ‌కాశాలు ఉన్నాయా ? అంటే మాస్‌కు ఎక్క‌దు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ సైతం ఇష్ట‌ప‌డే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేనే లేవంటున్నారు. మ‌రి ఎలా ? బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా రు. 200 పై చిలుకు కోట్ల షేర్ రాబ‌డుతుందా ? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ తెలియాలంటే క‌నీసం ఫ‌స్ట్ వీకెండ్ ముగియాలి. అప్పుడే రాధేశ్యామ్ అస‌లు జాత‌కం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

అస‌లు ఈ సినిమాలో మైన‌స్‌లు ఏంటి ? ఎన్నో అంచ‌నాల‌తో భారీ ఖ‌ర్చుతో తెర‌కెక్కినా ఎక్క‌డ తేడా కొట్టింది ? ఏలోపాలు సినిమా సూప‌ర్ టాక్‌కు అడ్డుప‌డ్డాయ‌న్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు. బాహుబ‌లి, సాహో సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ ఓ యోధుడు అయిపోయాడు. క‌త్తి ప‌ట్టుకుని శ‌త్రువుల‌ను చీల్చి చెండాడాలి.. సాహోలా బైక్ రేసింగ్‌లు, విల‌న్ల‌ను చిత‌క్కొట్టేయాలి. కానీ ఇవేవి ఈ సినిమాలో మ‌న‌కు క‌న‌ప‌డ‌వు. ఫైట్లు ఉండ‌వు. కనీసం హీరోయిన్‌ను టీజ్ కూడా చేయ‌డు. కేవ‌లం జాత‌కాల‌ను మాత్ర‌మే న‌మ్ముతూ ఉంటాడు.

ఇంకా చెప్పాలంటే ఇది హీరోయిజానికి స్కోప్ లేని కేరెక్ట‌ర్‌. పైగా యాంటీ మాస్ నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇవ‌న్నీ స‌గ‌టు సినిమా అభిమాని సంగ‌తి ఎలా ? ఉన్నా ప్ర‌భాస్ వీరాభిమానుల‌కు న‌చ్చ‌వు కాక న‌చ్చ‌వు. ఇక ప్ర‌ధానంగా ద‌ర్శ‌క‌త్వ విభాగంలో చేసిన మూడు పొర‌పాట్లే సినిమా రిజ‌ల్ట్‌ను బాగా ప్ర‌భావితం చేసిన‌ట్టు ఉన్నాయి. ఆ మిస్టేక్‌లు ఏంటో చూద్దాం.

మిస్టేక్ 1 :
హీరోలో ఎంతో మంది న‌టీన‌టులు ఉన్నారు. అయితే సినిమా అంతా ప్ర‌భాస్‌, పూజా హెగ్డేను చూపించేందుకే స‌రిపోతుంది. అల‌నాటి అందాల హీరోయిన్ భాగ్య శ్రీ అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఆమెను సినిమాలో వాడుకునేందుకు ఎంతో స్కోప్ ఉంది. అస‌లు ఆమెకు, ప్ర‌భాస్‌కు మ‌ధ్య మాతృత్వ అనుబంధంతో ఎన్నో సీన్లు రాసుకోవ‌చ్చు అవేవి లేవు. అస‌లు వాళ్ల‌కు స‌రైన క్యారెక్ట‌ర్లే రాసుకోన‌ప్పుడు.. వారు న‌టించ‌డానికి మాత్రం ఎక్క‌డ స్కోప్ ఉంటుంది. ఇక కునాల్ రాయ్ క‌పూర్ ప్ర‌భాస్ ఫ్రెండ్‌గా ఉన్నా.. ఎందుకు పనికిరాకుండా ఆ క్యారెక్ట‌ర్‌ను మార్చేశారు. ముర‌ళీ శ‌ర్మ లాంటి మంచి న‌టుడికి క‌నీసం ఒక్క‌టంటే ఒక్క మంచి డైలాగ్ కూడా లేదు.

మిస్టేక్ 2 :
అస‌లు సినిమా క‌థ‌ను బ‌ట్టి బ‌డ్జెట్ ఉండాలి.. ఏదో బాహుబ‌లి, సాహో ఆడాయ‌ని అవ‌స‌రం లేకుండానే బ‌డ్జెట్ పెట్టి. కోట్లు బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మార్చేశారు. 1970ల నాటి ఇట‌లీ సెట్‌ను ఇక్క‌డ రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసుకుంటే అంత ఖర్చు అయ్యేదే కాదు.. అన‌వ‌స‌రంగా ఇట‌లీకి వెళ్లి కోట్లు త‌గ‌లేసుకున్నారు. ఈ ప్రేమ‌క‌థ‌ను ఇండియాలోనే మంచి అంద‌మైన లొకేష‌న్ల‌లో బాగా చూపించ‌వ‌చ్చు. అక్క‌డ ఆర్ట్ వ‌ర్కా, సెట్టింగా అన్న‌ది ముఖ్యం కాదు. ప్రేమ‌క‌థ‌లో మంచి ఫీల్ ఉండాలి. అది ఈ సినిమాలో మిస్ అయ్యింది.

మిస్టేక్ 3 :
మంచి ఫీల్‌గుడ్ ఉన్న ప్రేమ‌క‌థ‌ల‌కు మ‌న‌స్సును హ‌త్తుకునే పాట‌లు ఉండాలి. రాధేశ్యామ్ సినిమా నేప‌థ్య సంగీతం సూప‌ర్‌. అయితే పాట‌లు ప్రేక్ష‌కుల‌కు అనుకున్న స్తాయిలో రిజిస్ట‌ర్ కాలేదు. అస‌లే స్క్రిఫ్టులో ఉన్న లోపాల‌కు తోడు ఇవ‌న్నీ క‌లిపి రాధేశ్యామ్‌ను అంచ‌నాల గీత‌కు ఎక్క‌డో ఆగిపోయేలా చేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news