Moviesఎన్టీఆర్ ల‌వ్ దెబ్బను షేక్ చేస్తోన్న విజ‌య్ బీస్ట్ సాంగ్ (వీడియో)

ఎన్టీఆర్ ల‌వ్ దెబ్బను షేక్ చేస్తోన్న విజ‌య్ బీస్ట్ సాంగ్ (వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా సుకుమార్ తెర‌కెక్కించిన నాన్న‌కు ప్రేమ‌తో ఎన్టీఆర్‌కు తిరుగులేని క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2015 సంక్రాంతి కానుక‌గా నాలుగు సినిమాల పోటీలో రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వ‌సూళ్లు, ఇత‌ర‌త్రా లెక్క‌లు ఎలా ఉన్నా ఎన్టీఆర్‌ను క్లాస్ లో ఫుల్ ఫాలోయింగ్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ సినిమాయే. టెంప‌ర్‌తో మాస్ జ‌నాలు ఉర్రూత‌లూగించేసిన ఎన్టీఆర్‌.. ఆ వెంట‌నే టెంప‌ర్‌తో క్లాస్ జ‌నాల మ‌దిని దోచేసి అక్క‌డ నుంచి అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌కుండా దూసుకుపోయాడు.

దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆల్బ‌మ్ కూడా సూప‌ర్ హిట్‌. ఈ సినిమాలో ల‌వ్ దెబ్బ సాంగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ పాట‌లో తార‌క్ – ర‌కుల్ పోటీ ప‌డి మ‌రీ స్టెప్పులు వేశారు. ఎన్టీఆర్ త‌న‌దైన క్లాస్ స్టెప్పుల‌తో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేశాడు. ఇక ఈ సినిమా వ‌చ్చి ఏడేళ్లు అవుతోంది. ఇప్పుడు మ‌రోసారి ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ బీస్ట్‌.

ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో అర‌బిక్ కుతూ అంటూ రిలీజ్ చేసిన సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసి ప‌డేస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాట‌కు ఎన్టీఆర్ ల‌వ్ దెబ్బ సాంగ్‌కు వేసిన మూమెంట్స్‌ను మిక్స్ చేసి యూట్యూబ్‌లో ఓ వీడియో వ‌దిలారు. పాట విజ‌య్‌ది.. స్టెప్పులు ఎన్టీఆర్‌వి.. ఇది బాగా సింక్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీడియోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్‌తో పాటు అనిరుధ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యాయి.

ఇప్పటికే ఈ వీడియోని ట్విటర్ లో 1.1 మిలియన్లకు పైగా చూడ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ ఫ్యాన్ మేడ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news