Moviesకొంప ముంచిన భీమ్లా నాయక్‌ నిర్మాత..ఎందుకయ్యా నీకు ఈ నోటి దూల..?

కొంప ముంచిన భీమ్లా నాయక్‌ నిర్మాత..ఎందుకయ్యా నీకు ఈ నోటి దూల..?

కోట్లాడి మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశ గా ఎదురు చుస్తున్న సినిమా..భీమ్లా నాయక్‌ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పై అభిమానులు ఏ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో మనకు తెలిసిందే. సర్ధార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్‌ కళ్యాణ్ ఈ సినిమాలోనే పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్నారు.

ఇక దగ్గుబాటి వారసుడు రానా విలన్ పాత్రల్లో నటించడం ఈ సినిమాకి మరీ ప్లస్ పాయింట్. దీంతో భీమ్లా నాయక్‌ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా నిన్న ..ఫిబ్రవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ను అఫిషీయల్ గా ప్రకటించడంతో ఆయన అభిమానులు ఖుషీ అయ్యారు.

అయితే, ఈ సినిమా నిర్మాత నాగ వంశీ రీసెంట్ గా రిలీక్ అయ్యి ఊహించని కలెక్షన్స్ సాధిస్తూ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డీజే టీల్లు అనే సినిమాని కూడా ప్రోడ్యూసర్ గా వ్యవహరించాడు. పెట్టిన దాని డబుల్ వచ్చాయని ఆనందంలో ఉన్నట్లు ఉన్నారు వంశీ..ఏం మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో తెలియకుండా అయ్యగారు కొంచెం తలపొగరుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగి డీజే టిల్లు సక్సెస్‌ మీట్‌తో నాగవంశీ ప్రేక్షకులను ‘వాడు, వీడు’ అంటూ అగౌరవంగా మాట్లాడాడట. దీంతో ఆయన మాటల తీరు పై అభిమానులు హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఆ వార్తలు అలా ఇలా చేరి ఫైనల్ గా నాగ వంశి..చెవికి చేరాయి. వెంటనే తడుముకుని ఇలా అయితే మనం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేం అనుకున్నారేమో కానీ ఆడియన్స్ ని క్షమాపణలు కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. అందులో ఆయన ప్రస్తావిస్తూ..”నేను ఎవ్వరిని కావాలి అని అన్నింది కాదు. నా బ్రదర్స్ లా భావించి మన వాళ్ళే కదా అని అనుకోని అలా ఏకవచనంతో పిలిచా. అది ఎవ్వరికైన నచ్చకపోయుంటే ..నన్ను క్షమించండి. ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. సినిమా భారీ సక్సెస్ అయిన ఆనందంలో అలా మాట్లాడాను” అంటూ నిర్మాత నాగవంశీ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు. ఏది ఏమైనా నాగ వంశీ పై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news