Moviesభీమ్లానాయ‌క్ ఈవెంట్లో త్రివిక్ర‌మ్ సైలెన్స్... ఏదో జ‌రిగింది.. కార‌ణం ఇదేనా..!

భీమ్లానాయ‌క్ ఈవెంట్లో త్రివిక్ర‌మ్ సైలెన్స్… ఏదో జ‌రిగింది.. కార‌ణం ఇదేనా..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త్రివిక్ర‌మ్ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ ప‌వ‌న్ అంటూ ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటాడు. ప‌వ‌న్‌ను త్రివిక్ర‌మ్ చ‌దివినట్టుగా ఇండ‌స్ట్రీలో వేరెవ్వ‌రు చ‌దివి ఉండ‌క‌పోవ‌చ్చు. ప‌వ‌న్ సిద్ధాంతాలు త్రివిక్ర‌మ్‌కు, త్రివిక్ర‌మ్ ప్ర‌వ‌ర్త‌న ప‌వ‌న్‌కు బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో వీరిద్ద‌రు మంచి స్నేహితులు అయ్యారు.

ప‌వ‌న్ సినిమా ఫంక్ష‌న్‌కు త్రివిక్ర‌మ్ వ‌చ్చాడంటే ఆ క‌ళే వేరుగా ఉంటుంది. త్రివిక్ర‌మ్ మామూలుగా మాట్లాడితేనే ఆ వేదిక హోరెత్తిపోతూ ఉంటుంది. అలాంటిది ఇక ప‌వ‌న్ తాజా సినిమా భీమ్లానాయ‌క్ రేపు థియేటర్ల‌లోకి వ‌స్తోంది. నిన్న హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అట్ట‌హాసంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇద్ద‌రు టీఆర్ఎస్ మంత్రులు, మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చారు. తెలంగాణ‌లో అధికార పార్టీ అంతా ఈ సినిమాకు ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తోంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

ఇక ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన త్రివిక్ర‌మ్ పెద్ద‌గా సంద‌డి చేయ‌లేదు. ఆయ‌న ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. భీమ్లానాయ‌క్ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ ఎందుకు మాట్లాడ‌లేదు ? అస‌లు ఆయ‌న ప‌వ‌న్ ప‌క్క‌న ఉండి మైక్ ప‌ట్టుకుంటే మాట‌ల తూటాలు పేల్చేస్తారు. త్రివిక్ర‌మ్ స్పీచ్‌తో మ‌నం మైమ‌ర‌చిపోతూ ఉంటాం. భీమ్లానాయ‌క్ టోట‌ల్ ప్రాజెక్టు వెన‌క ఉన్న వ్య‌క్తి త్రివిక్ర‌మ్‌. ఈ విష‌యం అంద‌రికి తెలుసు. అలాంటిది ఆయ‌న స్టేజ్‌మీద మాట్లాడ‌క‌పోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రావాలంటూ త్రివిక్ర‌మే స్వ‌యంగా కేటీఆర్‌ను ఆహ్వానించార‌ట‌. కేటీఆర్ వ‌చ్చి స్టేజ్‌మీదే ఆయ‌న హ‌డావిడే ఎక్కువుగా ఉంది. అయితే త్రివిక్ర‌మ్‌తో ఆయ‌న పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఈ వేడ‌క ఆద్యంతం త్రివిక్ర‌మ్ సైలెన్స్‌గా ఉండ‌డానికి వేరే కార‌ణం ఉంద‌న్న గుస‌గుస కూడా వినిపిస్తోంది. బండ్ల గ‌ణేష్‌తో వివాదం కార‌ణంగానే త్రివిక్ర‌మ్ సైలెంట్ అయ్యాడంటున్నారు.

త్రివిక్ర‌మ్ మాట్లాడి ప‌వ‌న్ గురించి ప్ర‌శంసిస్తూ ఉంటే నిజంగానే ఆడిటోరియం అంతా బండ్ల‌న్నా.. బండ్ల‌న్నా అన్న కేక‌లు వినిపించేవే అంటున్నారు. ఒక‌వేళ బండ్ల గ‌ణేష్ ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి ఉంటే త‌న స్పీచ్‌తో కావాల్సినంత ర‌చ్చ క్రియేట్ చేయ‌డంతో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేవాడు. ఇక ఈ ఫంక్ష‌న్‌కు ముందు కూడా బండ్ల గ‌ణేష్ ఓ ప‌వ‌న్ అభిమానితో మాట్లాడిన వీడియో కాల్ బ‌య‌ట‌కు రావ‌డం.. త‌న‌కు కావాల‌నే ఆహ్వానం పంప‌లేద‌ని.. త్రివిక్ర‌మ్ అడ్డుకున్నాడ‌ని చెప్పిన ఆడియో పెద్ద వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌దు కాని.. త్రివిక్ర‌మ్‌కు, గ‌ణేష్‌కు మ‌ధ్య భూవివాదాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇటు యాంక‌ర్ సుమ కూడా త్రివిక్ర‌మ్‌ను మాట్లాడాల‌ని పెద్ద‌గా ఒత్తిడి చేయ‌లేదు. ఇక త‌ను పేరు ప్ర‌స్తావించ‌వ‌ద్ద‌న్న విష‌యాన్ని త్రివిక్ర‌మ్ ముందుగానే సుమ‌కు చెప్పార‌న్న గుస‌గుస కూడా వ‌స్తోంది. అయితే కేటీఆర్‌కు మాత్రం త్రివిక్ర‌మ్ జ్ఞాపిక అంద‌జేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news