Moviesవిడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సినిమా అనేది ఎంత రంగుల ప్ర‌పంచ‌మో.. సినిమా వాళ్ల జీవితాలు కూడా అంతే రంగుల్లో తేలియాడుతూ ఉంటాయి. సినిమా వాళ్ల జీవితాలు పైకి మాత్ర‌మే చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా క‌న‌ప‌డుతూ ఉంటాయి. పైకి క‌న‌ప‌డే న‌వ్వులు, రంగులు వాళ్ల ఇంట‌ర్న‌ల్ జీవితాల్లో ఉండ‌వ‌న్న‌ది నిజం. పెళ్లి అయ్యాక ఏవైనా మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తే వారి జీవితం రోజూ న‌ర‌క‌ప్రాయ‌మే అవుతుంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌మ భ‌ర్త‌ల‌కు దూరం అయిన హీరోయిన్లు ఎవ‌రెవ‌రో ఓ సారి చూద్దాం.

భాను ప్రియ :
తెలుగులో ఒకప్పటి సంచలన స్టార్ హీరోయిన్ భానుప్రియ‌. ఆమె సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఓఒ వెలుగు వెలిగారు. తెలుగులో అంద‌రు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించారు. ఆ త‌ర్వాత ఆమె అమెరికాలో ఉండే ఆద‌ర్శ్ కౌశ‌ల్‌ను 1998లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు 2003లో అభిన‌య్ పుట్టాడు. 2005లో వీరు విడాకులు తీసుకున్నారు. కౌశ‌ల్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు.

అమలా పాల్ :
కోలీవుడ్ హీరోయిన్ అమ‌లాపాల్ తెలుగుతో పాటు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌. ఆమె ద‌ర్శ‌కుడు ఏఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుస‌గా సినిమాలు చేసింది. ఆ టైంలో వారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు. ఆ టైంలో అమ‌లాపాల్ ఓ హీరోతో స‌న్నిహితంగా ఉండ‌డ‌మే కార‌ణం అన్న రూమ‌ర్లు వ‌చ్చాయి.

కరిష్మా కపూర్:
బాలీవుడ్ ఫేమస్ నటి కరిష్మా కపూర్ 1990 – 2000వ ద‌శ‌కంలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆ త‌ర్వాత ఆమె 2003లో అమెరికాకు చెందిన ఎన్నారై సంజ‌య్‌క‌పూర్‌ను పెళ్లాడారు. 13 ఏళ్ల త‌ర్వాత వీరు 2016లో విడిపోయారు. భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేక విడాకులు ఇచ్చిన క‌రిష్మా ముంబైలో ఉంటున్నారు. సంజయ్‌తో పెళ్లికి ముందు క‌రిష్మాకు అభిషేక్ బ‌చ్చ‌న్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా క్యాన్సిల్ అయ్యింది.

రజనీ :
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రజనీ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించి హిట్లు కొట్టింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఆమె 1998 లో డాక్టర్ ముళ్ళగిరి ప్రవీణ్‌ని వివాహం చేసుకున్నారు. 2008 లో ఇద్దరూ విడిపోయారు.

సారిక :
ఒక‌ప్ప‌టి ఫేమ‌స్ న‌టి అయిన సారిక 1988లో క‌మ‌ల్‌హాస‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అంత‌కుముందే క‌మ‌ల్‌కు వాణి గ‌ణ‌ప‌తితో విడాకులు అయ్యాయి. 1988లో పెళ్లి చేసుకున్న ఈ జంట‌కు శృతీహాస‌న్‌, అక్ష‌ర‌హాస‌న్ పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. క‌మ‌ల్‌తో పెళ్లికి ముందే సారిక‌కు మాజీ క్రికెట‌ర్ ర‌విశాస్త్రితో ఎఫైర్ ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

రేవతి :
సీనియ‌ర్ హీరోయిన్ రేవ‌తి 1986లో ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు సురేష్‌చంద్ర మీన‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2013లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ర‌మాప్రభ :
1981 లో శరత్ బాబు ని పెళ్లి చేసుకుని సరిగా ఏడేళ్లకు ఆయనకు దూరమయ్యారు. వ‌య‌స్సులో శ‌ర‌త్‌బాబు కంటే ర‌మాప్ర‌భ పెద్ద‌వారు.

స‌మంత :
చెన్నైకు చెందిన స‌మంత రూత్ ప్ర‌భు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ ఆరేడే సంవ‌త్స‌రాలు ఓ వెలుగు వెలిగారు. త‌న తొలి సినిమా హీరో అయిన అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2013లో పెళ్లి చేసుకున్న ఈ జంట మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో 2017 అక్టోబ‌ర్‌లో విడాకులు తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news