Moviesఫ్యాన్స్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే...!

ఫ్యాన్స్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే…!

సినిమా రంగంలో పెళ్లిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జ‌రుగుతూ ఉంటాయి. ఎవ‌రు ? ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారో ? ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారో ? కూడా ఎవ్వ‌రికి తెలియ‌దు. కొంద‌రు హీరోలు అయితే త‌మ అభిమానినే పెళ్లి చేసుకున్నారు. విచిత్రంగా ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు త‌మ‌ను అభిమానించే అభిమానితోనే మూడు ముళ్లు వేయించుకుని.. ఏడ‌డుగులు వేసి వాళ్ల‌కు భార్య‌లు అయ్యారు. అలా ఫ్యాన్స్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంద‌రు హీరో, హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

దిలీప్ కుమార్ :
బాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి క్రేజీ హీరో దిలీప్‌కుమార్ సైరాభానును ప్రేమ వివాహం చేసుకున్నారు. సైరాభానుకు చిన్న‌ప్ప‌టి నుంచే దిలీప్‌కుమార్ అంటే ఎంతో ఇష్టం. ఈ విష‌యాన్ని దిలీప్‌కు చెప్పేయ‌డంతో 1966లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి ముద్దుల మ‌న‌వ‌రాలే స‌యేషా సైగ‌ల్ ( కోలీవుడ్ హీరో ఆర్య భార్య‌).

జితేంద్ర :
జితేంద్ర భార్య శోభా క‌పూర్ ఫ్లైట్ అటెండెంట్‌గా ప‌నిచేసేవారు. ఆమె జితేంద్ర‌కు అభిమాని. అలా ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

రజనీ కాంత్ :
ల‌త ర‌జ‌నీకాంత్‌కు చిన్న‌ప్ప‌టి నుంచి అభిమాని. ఆమె ఓసారి త‌న కాలేజ్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూ కోసం ర‌జ‌నీకాంత్‌ను క‌లిసేందుకు వెళ్లారు. అలా ర‌జ‌నీకాంత్ అంటే త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి ఎంత ఇష్ట‌మో చెప్పారు. అలా వారు ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారు.

రాజేష్ ఖ‌న్నా:
డింపుల్ కపాడియా తాను సినిమాల్లోకి అడుగు పెట్టె ముందు రాజేష్ ఖన్నాని కలిసారు. రాజేష్ ఖ‌న్నా అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అన్న విష‌యం ఆమె స‌న్నిహితుల‌కు కూడా చెప్పేవారు. వీరి కుమార్తే ట్వింకిల్ ఖ‌న్నా. ఆ త‌ర్వాత రాజేష్ ఖ‌న్నా డింపుల్‌కు విడాకులు ఇచ్చి మ‌రో వివాహం చేసుకున్నాడు.

మాధవన్ :
మాధవన్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్స్ కండ‌క్ట్ చేసేవాడు. ఓ క్లాస్‌కు స‌రిత హాజ‌రు కావ‌డంతో వారి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లిచేసుకున్నారు.

శిల్పాశెట్టి :
ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా శిల్పాశెట్టిని ఎంతో అభిమానించేవారు. వాళ్ల మ‌న‌స్సులు క‌ల‌వ‌డంతో వారు 2009లో పెళ్లి చేసుకున్నారు.

విజయ్ :
కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి భార్య సంగీత విజ‌య్‌కు వీరాభిమాని. ఓ షూటింగ్ టైంలో ఆమె విజ‌య్‌ను క‌లిశారు. ఆమె అప్ప‌టికే విజ‌య్‌కు వీరాభిమాని. వాళ్ల మ‌న‌స్సులు క‌ల‌వ‌డంతో వారు 1999లో పెళ్లి చేసుకున్నారు.

కిర‌ణ్‌రావు:
బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకు గానూ కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. కిర‌ణ్‌రావుకు అమీర్ అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమా టైంలో వారి సాన్నిహిత్యంతో వాళ్లు ఒక‌రినొక‌రు విడ‌వ‌లేని ప‌రిస్థితికి రావ‌డంతో వారు పెళ్లి చేసుకున్నారు. కిర‌ణ్‌రావును పెళ్లి చేసుకునేందుకే అమీర్ త‌న మొద‌టి భార్య రీనాద‌త్తాకు విడాకులు ఇచ్చాడు. ఇక ఇటీవ‌ల ఫాతిమా స‌నా షేక్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడ‌న్న టాక్ నేప‌థ్యంలో కిర‌ణ్‌రావుకు కూడా విడాకులు ఇచ్చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news