Moviesఆ హీరో కొడుకు కోసం కాంప్రమైజ్ అవుతున్న పూజా..యవ్వారం తేడాకొడుతుందే..?

ఆ హీరో కొడుకు కోసం కాంప్రమైజ్ అవుతున్న పూజా..యవ్వారం తేడాకొడుతుందే..?

పూజా హెగ్డే..చీర కడితే కుందనపు బొమ్మలా ..మోడ్రెన్ డ్రెస్ లో బుట్టబొమ్మలా కనిపిస్తూ కుర్రలకు అందాల ట్రీట్ ఇస్తుంటుంది. మొదట్లో పెద్దగా పూజా అందాల పై కాన్సెంట్రషన్ చేయని జనాలు..ఆ తరువాత అమ్మడు ప్యాంట్ వేసుకోకుండా..ఫోటో షూట్ చేసే సరికి ఆ అందాలకు మైమరిచిపోయారు. దీంతో అమ్మడు క్రేజ్ పెరిగింది. ఆ తరువాత సినిమాలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు పూజా కెరీర్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం అమ్మడు డైరెక్టర్ నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. తెలుగులో దాదాపు అందరి టాప్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ ల రేంజ్ కి వెళ్ళిపోయిన.. పూజా హెగ్డే ..ప్రభాస్ పక్కన ప్రేరణ గా నటించిన – రాధాకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం త్రివిక్రం డైరెక్షన్ లో మహేష్ సరసన SSMB#28 చిత్రంలో నటిస్తుంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్ లతో సెగలు పుట్టిస్తుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ అక్కినేని కుర్రాడి తో మరోసారి జత కట్టనున్నట్లు తెలుస్తుంది. విడాకుల తరువాత సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్న నాగ చైతన్య..త్వరలో ఓ రొమాంటిక్ సస్పెన్స్ ధీలర్ మూవీలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కధకు ఫిదా అయిన చై..ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని..స్టోరీ అంతా ఆమె పైనే ఆధారపడి ఉంటదని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో మేకర్స్ హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసిన్నట్లు సినీ వర్గాలల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ స్టోరీ అమ్మడు రేంజ్ కు సరిపడింది కాదు.. కానీ నాగ చైతన్య కోసం ఆమె ఈ సినిమా కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీని పై నెటిజన్స్ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. అక్కినినేని కుర్రాళ్లపై పూజా మోజు పడిందని..అందుకే అమ్మడు రేంజ్ సినిమా కాకపోయినా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది వరకే పూజా నాగ చైతన్య సరసన ఒక లైల కోసం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news