Moviesతారక్ కొత్త సినిమా న్యూస్.. ఫాన్స్ కి పూనకాలే.. కానీ టెన్షన్...

తారక్ కొత్త సినిమా న్యూస్.. ఫాన్స్ కి పూనకాలే.. కానీ టెన్షన్ కూడా.. ఎందుకో తెలుసా?

జక్కన్న తో తీసిన త్రిబుల్ ఆర్ కారణంగా దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరమైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొరటాల శివతో జనతా గ్యారేజ్ అనే హిట్ సినిమా చేసిన ఎన్టీఆర్ ఇక ఇప్పుడు మరో సారి ఇక ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమాకు సిద్ధమైపోయాడు. తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు.. ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడట.

దీంతో ఇక ఇప్పట్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ఉండడం కష్టమే అని తెలుస్తోంది. ఇదే గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడట ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్ కూడా చెప్పడంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు తో సినిమాకి ఓకే చేశాడట. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక ఫ్యాన్స్ అందరికీ పూనకాలు వచ్చే విధంగా కథ రెడీ చేశాడట బుచ్చిబాబు.ఇక ఈ కథ తారక్ వినిపించగా అటు ఎన్టీఆర్ కూడా ఫిదా అయిపోయడట.

అంతా బానే ఉంది కానీ బుచ్చిబాబు మీదనే డౌట్ పడుతున్నారు అభిమానులు. ఎందుకంటే ఉప్పెన సినిమా కి ముందు ఆ కథ గురించి ఎంతగానో హైప్ పెంచేశారు. తీరా చూస్తే ప్రేక్షకులు ఊహించినంత బలమైన కథ సినిమాలో కనిపించలేదు. ఇక ఇప్పుడు తారక్ తో సినిమాకు కథ అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో ఇక ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో అని టెన్షన్ మొదలైందట అభిమానుల్లో.. ఏం జరుగుతుందో చూడాలి.

అయితే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథలో ఎన్టీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కబడ్డీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఉప్పెన సినిమాతో సెన్సేషన్ విజయాన్ని సాధించిన దర్శకుడు బుచ్చిబాబు తన రెండవ సినిమా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేస్తూ ఉండడంతో ఇక ఈ సినిమాపై రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news