Moviesపెళ్లి పీట‌లెక్క‌బోతున్న బాల‌య్య త‌న‌యుడు.. అమ్మాయి ఎవ‌రంటే?

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న బాల‌య్య త‌న‌యుడు.. అమ్మాయి ఎవ‌రంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఒక్క‌గానొక్క కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎప్పుడెప్పుడు సినీ గ‌డ‌ప తొక్కుతాడా అని నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ఎన్నో వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. కానీ, అవేమి నిజం కాలేదు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య.. తన తనయుడు ఆదిత్య 369 సీక్వెల్ `ఆదిత్య 999 మాక్స్` మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు పేర్కొన్నాడు.

అలాగే 2023లో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ముందుకు రానుంద‌ని.. ఇంకా డైరెక్ట‌ర్ ఫైన‌ల్ కాలేద‌ని బాల‌య్య చెప్పుకొచ్చారు. అయితే ఆ త‌ర్వాత‌ ఈ ప్రాజెక్ట్‌పై ఒక్క‌టంటే ఒక్క‌ అప్డేట్ కూడా ఇవ్వ‌లేదు. దీంతో మోక్ష‌జ్ఞకు సినిమాల‌పై ఇంట్ర‌స్ట్ లేద‌ని.. అత‌డు బిజినెస్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక తాజాగా మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. మోక్ష‌జ్ఞ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ట‌. నంద‌మూరి ఇంటికి కోడ‌లిగా రాబోయే అమ్మాయి ఎవ‌రో కాదు.. బాల‌య్య సోద‌రి దగ్గుబాటి పురందేశ్వరికి ద‌గ్గ‌ర బంధువ‌ట‌. అందుకే మొన్నీమ‌ధ్య నందమూరి ఫ్యామిలీ అంత దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశార‌ట‌.

ఇక అక్క‌డే మోక్షజ్ఞ వివాహంపై కుటుంబ సభ్యులంతా చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విష‌యంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఉన్నట్టుండి బాల‌య్య ఫ్యామిలీ పురంధరేశ్వరి ఇంటికి వెళ్ల‌డంతో మోక్ష‌జ్ఞ పెళ్లి విష‌యం గురించే అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news