Moviesమెగా బ్ర‌ద‌ర్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన స‌మంత‌...!

మెగా బ్ర‌ద‌ర్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన స‌మంత‌…!

చెన్నై చిన్న‌ది స‌మంత ఇప్పుడు బాగా రిలాక్స్ అయిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. చైతుతో విడాకుల త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు ఓకే చేస్తోంది. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఒక‌టి రెండు వెబ్‌సీరిస్‌ల‌కు కూడా ఓకే చెప్పింది. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లకే ఎక్కువుగా ఓటేస్తూ వ‌స్తోన్న స‌మంత ఇప్పుడు ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా కూడా రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా కోలీవుడ్ మెగా బ్ర‌ద‌ర్ కార్తీతో ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించేందుకు ఆమె గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

కోలీవుడ్‌లో మెగా బ్ర‌ద‌ర్స్‌గా పేరున్న కార్తీ, సూర్య‌.. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగులో కూడా పాపులారిటీ ఉన్న హీరోయిన్‌ను తీసుకుంటే ఇక్క‌డ కూడా త‌మ సినిమాల‌కు మాంచి బిజినెస్ వ‌స్తుంద‌న్న ప్లాన్‌తోనే ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ సినిమాల టెక్నీషియ‌న్ల విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కార్తీ హీరోగా స‌తీష్ సెల్వ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక గ‌తంలోనే సూర్య – స‌మంత కాంబోలో సికింద‌ర్ సినిమా వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ టైంలోనే స‌మంత – కార్తీ కాంబోలో సినిమా రావాలి. అయితే కాస్త ఆల‌స్యంగా ఇప్పుడు వీరి కాంబోలో సినిమా వ‌స్తోంది. బ్యాచిల‌ర్ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న స‌తీష్ సెల్వ‌కుమార్ ఇప్పుడు కార్తీ – స‌మంత కాంబోలో ఓ క్రేజీ క‌థ‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా బ‌న్నీ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేశాక స‌మంత క్రేజ్ మ‌రింత‌గా పెరిగిపోయింది. ఆమె ఈ వ‌య‌స్సులో హీరోయిన్‌గా మాత్ర‌మే కాకుండా ఐటెం సాంగులు చేయ‌డం.. హాట్ హాట్ వెబ్‌సీరిస్‌ల‌లో న‌టించేందుకు కూడా ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా గ్రీన్‌సిగ్నల్స్ ఇస్తోంది. కార్తీ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అయితే ఇక స‌మంత సీనియ‌ర్ హీరోల‌కు కూడా ఆమె బెస్ట్ ఆప్ష‌న్‌గా మారిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news