Moviesబాల‌య్య గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో రివీల్ చేసేసిన పూరి... !

బాల‌య్య గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో రివీల్ చేసేసిన పూరి… !

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షో విశేష‌మైన ప్రేక్ష‌కాదాద‌ర‌ణ సొంతం చేసుకుంది. imdbలో అత్య‌ధిక రేటింగ్ తెచ్చుకున్న షోగా రికార్డుల‌కు ఎక్కిన ఈ అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌సారం అయిన అన్ని ఎపిసోడ్లు టాప్ రేటింగ్ తెచ్చుకున్నాయి. తాజాగా సంక్రాంతి కానుక‌గా ప్ర‌సారం అయిన ఎపిసోడ్‌లో లైగ‌ర్ టీం సంద‌డి చేసింది. ఇందులో బాల‌య్య పంచెక‌ట్టుతో ద‌ర్శ‌న‌మిచ్చాడు.

ఈ ఎపిసోడ్‌లో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిర్మాత చార్మీల‌తో బాల‌య్య స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఈ ఎపిసోడ్‌లో బాల‌య్య – పూరి చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు వెల్ల‌డించారు.
టాక్ షో అన‌గానే మ‌డిక‌ట్టుకుని కూర్చొని నాలుగు ప్ర‌శ్న‌లు అడిగేసి.. అటు ప‌క్క‌నోళ్లు డిప్ల‌మాటిక్‌గా ఆన్స‌ర్లు ఇస్తుంటే నా వ‌ల్ల కాద‌ని చెప్పేశాన‌ని బాల‌య్య చెప్పారు.

వ‌చ్చిన వాళ్ల‌తో ఆడుకుంటాన‌ని తాను చెప్పాన‌ని.. ఓ కండీష‌న్ పెట్టాన‌ని బాల‌య్య చెప్పారు. ఈ క్ర‌మంలోనే పూరీతో ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని సొంత ఊరి నుంచి ట్రైన్ ఎక్కిన‌ప్పుడు చివ‌రిసారిగా ఏ అమ్మాయిని క‌లిశావు అని పూరికి పంచ్ ప్ర‌శ్న వేశారు. పూరి మాత్రం అలాంటిదేమి లేద‌ని ఆన్స‌ర్ దాట‌వేసేశాడు.

పైసా వ‌సూల్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు పోర్చుగ‌ల్‌లో నా గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్ప‌గ‌ల‌వా ? అని బాల‌య్య పూరిని షాకింగ్ ప్ర‌శ్న వేశారు. మీకు అభ్యంత‌రం లేక‌పోతే చెప్పేస్తాన‌న్న పూరి పోర్చుగ‌ల్‌లో నీ గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరు క‌రోలినా అని చెప్ప‌డంతో అంద‌రూ అవాక్క‌య్యారు. వెంట‌నే బాల‌య్య ఆ టైంలో వ‌సుంధ‌ర కేరోవాన్‌లోనే ఉంది.. లంచ్ టైంలో ఏమౌతుందో ? అని కాస్త భ‌యం న‌టించి.. న‌వ్వించారు.

ఇక మ‌ళ్లీ బాల‌య్య – పూరి కాంబోలో సినిమా ఎప్పుడు అని చార్మీ ప్ర‌శ్నించ‌గా… బాల‌య్య ఎప్పుడు అంటే అప్పుడే అని పూరి చెప్పారు. బాల‌య్య కూడా తాను రెడీ అని చ‌చెప్ప‌డంతో పాటు ఈ సినిమాకు ఏక్ పెగ్ లా అన్న టైటిల్ పెడ‌దామ‌ని స‌ర‌దాగా జోక్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news