Moviesఎన్టీఆర్ డైలాగ్‌తో చంపేసిన నిధి అగ‌ర్వాల్‌.. !

ఎన్టీఆర్ డైలాగ్‌తో చంపేసిన నిధి అగ‌ర్వాల్‌.. !

ప్ర‌స్తుతం తెలుగులో నిధి అగ‌ర్వాల్ టైం న‌డుస్తోంది. మిస్ట‌ర్ మ‌జ్ను లాంటి సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. రామ్ ప‌క్క‌న పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా చేయ‌డం ఆమె కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసేసింది. ఇక ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోల‌కు ఆమె బెస్ట్ ఆప్ష‌న్ అయిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌వ‌న్ ప‌క్క‌న ఛాన్స్ అంటే నిధి మామూలు ల‌క్కీ కాదు.

 

ఇక సంక్రాంతికి గ‌ల్లా వార‌సుడు అశోక్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హీరో సినిమాలో కూడా నిధి న‌టించింది. కొత్త కుర్రాడితోనే ఏమాత్రం మొహ‌మాటం లేకుండా లిప్‌లాక్ కూడా చేసేసింది. ఈ సినిమా రిజ‌ల్ట్‌, వ‌సూళ్లు ఎలా ? ఉన్నా కూడా నిధి వ‌ల్లే ఈ సినిమాకు ఇంత మాత్రం క్రేజ్ అయినా వ‌చ్చింద‌నే అంటున్నారు. ఈ సినిమాలో న‌టించేందుకు ఆమె కోటి రూపాయ‌లు డిమాండ్ చేస్తే నిర్మాత‌లు మ‌రో మాట లేకుండా ఓకే చెప్పేశార‌ట‌.

ఇక ఎంత బిజీగా ఉన్నా కూడా నిధి సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌కు అప్‌డేట్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఇటీవ‌ల ఆమె కాస్త ఒళ్లు చేసింద‌న్న కామెంట్లు నెటిజ‌న్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకు ఆమె ఫేస్‌, ఫిజిక్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. హీరోలో కూడా కాస్త ఆమె లావుగానే క‌నిపించింది. తాజాగా జ‌స్ట్ ఫ‌ర్ ప‌న్ అంటూ నిధి ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఈ వీడియోలో ఆమె ప‌లువురు స్టార్ హీరోల డైలాగుల‌ను ఇమిటేట్ చేసింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో నిధి ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్‌, గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆది సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన అమ్మ‌తోడు అడ్డంగా న‌రికేస్తా డైలాగు, బాల‌య్య ట్ర‌బుల్ డైలాగ్‌, వెంక‌టేష్ గ‌ణేష్ డైలాగులు చెప్పి ఆక‌ట్టుకుంది.

ఈ వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. ఇక సోష‌ల్ మీడియా కోసం ప్ర‌త్యేక‌మైన టీంను ఏర్పాటు చేసుకున్న నిధి త‌న ఫాలోవ‌ర్స్‌ను బాగా పెంచుకుంటోంది. ఏదేమైనా ప‌వ‌న్ సినిమా త‌ర్వాత నిధికి పెద్ద హీరోలు, క్రేజీ హీరోల సినిమాల్లో వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news