Moviesప్ర‌గ్య ఎంత ప‌ని చేసింది... అఖండ దెబ్బ‌తో రేటు ట్రిబుల్ చేసేసింది..!

ప్ర‌గ్య ఎంత ప‌ని చేసింది… అఖండ దెబ్బ‌తో రేటు ట్రిబుల్ చేసేసింది..!

ప్ర‌గ్య జైశ్వాల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ చాలా రోజులే అయ్యింది. ఎందుకో అందం, అభిన‌యం ఉన్నా కూడా ఆమెకు మంచి అవ‌కాశాలు రాలేదు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కంచె సినిమాలో న‌టించిన ప్ర‌గ్య న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ఆమెకు ఛాన్సులు లేవు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఆ సినిమా హిట్ అయినా కూడా ప్ర‌గ్యాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే మ‌రోసారి బోయ‌పాటి ఆమెకు తిరుగులేని లైఫ్ ఇచ్చాడు.

ఈ సారి ఏకంగా బాల‌య్య లాంటి స్టార్ హీరో ప‌క్క‌న అఖండ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అఖండ‌లో ప్ర‌గ్య పాత్ర‌, న‌ట‌న‌, డైలాగులు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి. బాల‌య్య‌కు ప‌ర్‌ఫెక్ట్ జోడీగా సెట్ అయ్యింది. ఈ సినిమా ప్ర‌గ్య కెరీర్‌లోనే తిరుగులేని టాప్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న రేటు పెంచేసింద‌ని తెలుస్తోంది. అఖండ హిట్ అయ్యాక ఆమెకు ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయ‌ట‌.

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టించేందుకు చాలా మంది హీరోయిన్లు ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ఇప్పుడు వాళ్ల‌కు సీనియ‌ర్ హీరోయిన్లో లేదా అవుట్ డేటెడ్ హీరోయిన్లే గ‌తి అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌గ్య‌కు తాజా సినిమాలో ఛాన్స్ రాగా రు. కోటి ఇస్తేనే న‌టిస్తాన‌ని ఆమె కండీష‌న్లు పెట్టింద‌ట‌. ఆమె రేటు చూసి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అదిరిప‌డుతున్నార‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు ఒక్కో సినిమాకు రు. 30 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే ఎక్కువ అనుకునేవారు. ప్ర‌గ్య కూడా ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఆ మాత్రం మించి డిమాండ్ చేయ‌లేని ప‌రిస్థితి ఉండేది. ఎప్పుడు అయితే అఖండ రూపంలో ఆమెకు హిట్ వ‌చ్చిందో ఇప్పుడు రేటు డ‌బుల్ కాదు.. ఏకంగా ట్రిబుల్ చేసేసింది. ఎంత డ‌బుల్ చేసినా రు. 50 లేదా రు. 60 ల‌క్ష‌లు అడుగుతారు. అయితే ఏకంగా రు. కోటి డిమాండ్ చేస్తుండడం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news