Newsఆ విషయంలో తొందర పడ్డానేమో..సానియా ఊహించని కామెంట్స్..!!

ఆ విషయంలో తొందర పడ్డానేమో..సానియా ఊహించని కామెంట్స్..!!

సానియామీర్జా .. ఈ పేరు గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మన భారదేశానికి ఎన్నో మెడల్స్ సాధించి పెత్తిన క్రీడాకారిణి. ఇండియన్ టెన్నిస్ స్టార్ గా గుర్తింపు పొందిన సానియామీర్జా కు మన భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భారత మహిళా టెన్నిస్ లో.. ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఎన్నో రికార్డులను సాధించి తన ఖాతాలో వేసుకుంది సానీయా.

పబ్లిసిటీ కోసం నలుగురిలో కాస్తంత గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు సానియా మీర్జాకు అలవాటే. ఆ మధ్యకాలంలో తనతో పాటే క్రేజ్ తెచ్చుకుంటున్న సైనా నెహ్వాల్ ప్రతిభను కాస్త తగ్గించి మాట్లాడి తన టాలెంట్ గురించి కాస్త ఎక్కువ చెప్పుకుంది కూడా అందుకే. అప్పట్లో ఆ మ్యాటర్ చాలా హాట్ గా నడిచిన సంగతి తెలిసిదే. ఇక ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింక్ది. ఈమె పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక బాబుకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో బుధవారం ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్‌తో కలిసి డబుల్స్‌లో తలపడిన సానియా మీర్జా.. స్లోవేనియాకి చెందిన కాజా జువాన్‌-తమరా జిదాన్‌సెక్‌ జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఈ సీజన్​ తర్వాత ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు​ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై తాను పశ్చాత్తాప పడుతున్నట్లు వెల్లడించింది.

నిర్ణయం సరైనదే అయినా ప్రకటించిన సమయం సరైంది కాదని, ఆ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఇదే లాస్ట్ సీజన్ అని ప్రకటించిన క్రమంలో ఈ టూర్, ఆట టెన్నిస్ పట్ల.. టూర్ విషయంలో ఆమె దృక్పథాన్ని మార్చిందా.. అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. డబుల్స్ నెం.1గా ఒకప్పుడు టెన్నిస్‌లో ఆధిపత్యం చెలాయించిన సానియా మీర్జా.. ఇప్పటికే ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. ఈ ఏడాది సీజన్ ముగిసే వరకూ ఆడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చిన సానియా మీర్జా.. మోకాలి గాయం కారణంగా అది కాస్త కష్టమేనని వెల్లడించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news