Moviesబాయ్ ఫ్రెండ్ మీద మోజుతో మొగుడితో అలా..ఛీ కోట్టిన భర్త ఏం...

బాయ్ ఫ్రెండ్ మీద మోజుతో మొగుడితో అలా..ఛీ కోట్టిన భర్త ఏం చేసాడొ తెలుసా..!

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు, అఫైర్స్, ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ కామన్ గా వినిపించే పేర్లు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో .. డేటింగ్ లు అలాగే ప్రేమ వ్యవహారాలు గురించి ఎక్కువగా రూమర్లు వస్తుంటాయి. అలాగే ఒక హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ గా మూవ్ అయినా, లేకుంటే వరుసగా రెండు మూడు సినిమాలు చేసినా వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు పుట్టుకొస్తుంటాయి. వాటి గురించి కొన్ని ఇంటర్వ్యూలలో వారిని నేరుగా అడిగినా.. ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్, ఈ రూమర్స్ ఎలా వస్తాయో మాకు తెలీడం లేదు’ .. ఎక్కువగా ఇలాంటి సమాధానాలే వస్తుంటాయి.

అయితే కొదరు నిజంగానే ప్రేమలో పడి పెళ్లిలు చేసుకుంటున్న ఆ బంధాని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకబోతున్నారు. కొందరు చిన్న ప్లాబ్లంస్ కే విడిపోతుంటే. మరికొందరు వేరే వాళ్లతో అఫర్ పెట్టుకుని కట్టుకున్న భర్తలకి దివర్స్ ఇస్తున్నారు. ఇక ఇదే లిస్ట్ లోకి వస్తుంది ముదురు ముద్దుగుమ్మ..బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ. ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్‌ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్‌ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్‌ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

మొహబత్తెన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిమ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన కూడా మంచి ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ కాలం గడిపుతున్న సమయంలోనే ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమ వ్యవ హారం ఘాటుగ నడిపి .. కొంతకాలం సహజీవనం కూడా చేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయింది. యువరాజ్ తో విడిపోయాక అమ్మడు చాలా మంది ప్రేమాయణాలు నడిపింది.

కానీ ఫైనల్ గా కెన్యా కు చెందిన వ్యాపారవేత్త అలీ పుంజాని ని వివాహం చేసుకుంది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు..ఎందుకంటే అలీ పుంజాని తన కంటే వయస్సు లో చాలా పెద్దవాడు. అయితే కొన్ని రోజులు బాగానే సాగిన వీళ్ల కాపురం..మధ్యలో మళ్ళీ బ్రేక్ పడింది. ప్రియుడు యువరాజ్ గుర్తు రావడంతో అమ్మడు భర్తను దూరంగా పెట్టిందట..దీంతో విసిగిపోయిన భర్త చీ కొట్టి విడాకులు ఇచ్చేశాడు అంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ప్రస్తుతం అమ్మడు టెన్నిస్​ ప్లేయర్​ లియాండర్ పేస్ తో గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా ఈ ఇద్దరు బాహాటంగానే తిరుగుతున్నారు కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news