Moviesపేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ..కొత్త పేరు ఇదే..!!

పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ..కొత్త పేరు ఇదే..!!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ యంగ్ హీరో గురించి ఎంత చెప్పిన తక్కువే. టాలీవుడ్ లో ఈ యూత్ హీరోకి ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

విజయ్ దేవరకొండ .. యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరో. తన ఆటీట్యూ డ్, సినిమాలతో ఈ తరం యూత్‌కు చాలా దగ్గరయ్యాడు. అంతేకాకుండా రోల్ మోడల్ గా మారిపోయాడు విజయ్. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారి సెన్సేషన్ సృష్టించిన నటుడు విజయ్ దేవరకొండ… ఈ సినిమా సూపర్‌ హిట్ అందుకోవటామే కాదు జాతీయ స్థాయి క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌. తరువాత గీత గోవిందం సినిమా కూడా ఘన విజయం సాధించటంతో విజయ్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది.

ఏ సినిమా చేసినా విజయ్‌ దేవరకొండ డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో..లైగర్ అనే సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో..మళ్లీ ఆయన డైరెక్షన్ లోనే మరో సినిమా కూడా తీయ్య బోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా పలు సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్  గా ఉంటున్న ఈయన .. యాడ్ లు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

ఇంతకాలంగా విజయ్‌ దేవరకొండగా తెలిసిన ఈ హీరో పేరు మార్చుకున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్‌ల ప్రకారం మహేష్ బాబు చేస్తున్న ఓ పాపులర్ యాడ్ లో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట. కొన్నేళ్లుగా మహేష్ ‘థమ్స్ అప్’యాడ్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే..అయితే తాజాగా ఈ ప్రకటనలో మహేష్ బాబు బదులుగా విజయ్ దేవరకొండ ను తీసుకున్నారట మేకర్స్. ఇప్పుడు ఈ యాడ్ మనకు మహెష్ బాబు కనిపించరు. మహెష్ ప్లేస్ లో విజయ్ కనిపించనున్నారు. కాగా దీనికోసం విజయ్ తన పేరుని కూడా మార్చుకున్నాడు. సోషల్ మీడియా హ్యాండిల్ పేరును “విజయ్ దేవరకొండ తుఫాన్”గా చేంజ్ చేశాడు ఈ రౌడీ హీరో. ఇక యాడ్ కూడా ట్విట్టర్ లో తుఫాన్ సృష్టిస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news