Moviesఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ కొడుకుతో అమీషా ప‌టేల్ డేటింగ్‌.. పెళ్లి...

ఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ కొడుకుతో అమీషా ప‌టేల్ డేటింగ్‌.. పెళ్లి కూడా…?

అమీషా ప‌టేల్ ఇర‌వై ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో హృతిక్‌రోష‌న్ హీరోగా వ‌చ్చిన క‌హోనా ప్యార్ హై సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ త‌ర్వాత తెలుగులో 2000లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బద్రి సినిమాలో న‌టించింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెర‌పై తొలిసారిగా మెరిసింది. ఆ సినిమా హిట్ అయ్యాక ఆమెకు ఇక్క‌డ మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత తెలుగులో మ‌హేష్‌బాబు ప‌క్క‌న నాని – ఎన్టీఆర్‌తో న‌ర‌సింహుడు – బాల‌య్య ప‌క్క‌న ప‌ర‌మ‌వీర‌చ‌క్ర సినిమాలు చేసింది. కోలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో న‌టించింది. అయితే ఆమె బాలీవుడ్‌లోనే స్థిర‌ప‌డింది. ఇప్ప‌టికే నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్న అమీషా ఇప్ప‌ట‌కి పెళ్లి చేసుకోలేదు. ఓ వైపు ఆంటీ ఏజ్ దాటేసి.. అమ్మ‌మ్మ ఏజ్‌లో ఉన్న అమీషా హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో సెగ‌లు రేపుతూ ఉంటుంది.

తాజాగా అమీషా ప‌టేల్ ఓ టాప్ కాంగ్రెస్ లీడ‌ర్ కొడుకుతో డేటింగ్‌లో ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత అహ్మ‌ద్ ప‌టేల్ కుమారుడు పైస‌ల్ ప‌టేల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అమీషాకు ప్ర‌పోజ్ చేశాడు. పైస‌ల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అంద‌రూ అత‌డికి విషెస్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే అమీషా హ్యాపీ బ‌ర్త్ డే మై డార్లింగ్ .. ల‌వ్ యూ అని రాసుకువ‌చ్చింది. ఈ సంవ‌త్స‌రం నీకు అద్భుతంగా ఉంటుంది.. అని చెప్పింది.

దీనికి స్పందించిన పైస‌ల్ ధ‌న్య‌వాదాలు నేను నీకు అధికారికంగానే ప్ర‌పోజ్ చేస్తున్నాన‌నంటూ చెప్పాడు. మీరు న‌న్ను పెళ్లి చేసుకుంటారా ? అని ఓపెన్‌గానే అడిగేశాడు. ఆ త‌ర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసినా అప్ప‌టికే అది స్క్రీన్ షాట్ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. కొద్ది రోజులుగా రిలేష‌న్‌లో ఉన్న వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు టాక్ ?

ఇక అమీషా వ‌య‌స్సు 45 ఏళ్లు పైనే.. పైస‌ల్ ప‌టేల్‌కు ఇంత‌కుముందే వివాహం అయ్యింది. అత‌డి మొద‌టి భార్య గుండెపోటుతో 2017లోనే మృతి చెందారు. పైస‌ల్ హెచ్ఎంపీ ఫౌండేష‌న్‌కు సీఈవోగా ఉన్నారు. ప్ర‌స్తుతం అమీషా గ‌ద‌ర్ 2 సినిమా చేస్తోంది. వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్టు స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news