Moviesసిరి ఎలిమినేట్ అయితే నిజంగా షణ్ముఖ్ గెలుస్తాడా .. బిగ్ బాస్...

సిరి ఎలిమినేట్ అయితే నిజంగా షణ్ముఖ్ గెలుస్తాడా .. బిగ్ బాస్ ప్లాన్ అదేనా ?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో అయిన బిగ్ బాస్ ..ఇప్పటిక్కే నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకుని..మరి కొన్ని రోజుల్లో ఐదవ సీజన్ కూడా కంప్లీట్ చేసోబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించి విన్నర సన్నీనే అంటూ బయట , సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక ఓటింగ్స్ కూడా అంతే గట్టిగా వేస్తున్నారు అభిమానులు. మరో వైపు యూట్యూబర్ షణ్ముఖ్ కి కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ సిరి తో బిహేవ్ చేసే పద్ధతి నచ్చక కొందరు ఆయనను సపోర్ట్ చేయట్లేదు. దీంతో ఆయన కొంచెం వెనకపడ్డారు అంతే.

కాగా బిగ్ బాస్ స్సిజన్ స్టార్ట్ అవ్వకముందు నుండే యూట్యూబర్ షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి వెళతారు అని టైటిల్ విన్ అవుతారు అని అందరు అనుకున్నారు. అందరు అన్నటే షన్ను బిగ్ బాస్ లోకి వెల్లినా టైటిల్ మాత్రం కొట్టే పరిస్ధితులు కనిపించడంలేదు. ఎందుకంటే షణ్ముఖ్ మొదట నుండి గేం ఆడలేదు.. రెండు వారాలు తరువాత నాగార్జున పచ్చి మ్రిచి తినిపిస్తే అప్పుడు పౌరుషంగా గేం ఆడటం స్టార్ట్ చేసాడు..

హమ్మాయ్య పోనిలే ఆడుతున్నాడు అనుకునేసరికే సిరి తో ఎక్కువ చనువుగా ఉంటున్నారు. దీంతో అందరు షన్ను గేం ఆడటానికి వచ్చాడా..సిరి తో జాలీగా గడపడానికి వచ్చాడా అంటూ మండిపడ్డారు. ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో సిరి అమ్మ అయితే షన్ను మొహం మీదనే చెప్పెసింది.

మీరు అలా కౌగిలించుకోవడం నాకు నచ్చలేదు అని.. ఇక సిరి కి కాబోయే భర్త అయితే నన్ను వదిలేస్తున్నావా సిరి అని అందరి ముందే అడిగేసాడు..? పోనీ ఇవ్వని చూసాక అయినా వాళ్లు మారారా అంటే అది లేదు. నిజానికి షన్ను సిరిని టచ్ చేయడమే మానేసాడు కానీ సిరి మాత్రం మళ్లి కౌగిలించుకుంటూ షన్ను కి దగ్గరవుతుంది. దీంతో మళ్ళి షణ్ముఖ్ ని బ్యాడ్ గా ప్రోజెక్ట్ చేస్తున్నట్లైంది.

అదే టైంలో సన్నీ ఇంత్లో అందరితో కలిసి ఉంటూ..గేం ఆడుతూ..హౌస్ లో బాగా ఎంటర్ టైన్ చేస్తూ..టైటిల్ విన్నర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇలాంటి పరిస్ధితుల్లో షన్ను సిరిని దూరం పెట్టినా..లేక టైం బాగులేక ఎలిమినేట్ అయిన టైటిల్ కొట్టే ఛాన్స్ లు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news