Moviesవద్దు వదిలేయ్ అని చెప్పినా వినలేదు..ఆ డైరెక్టర్ నాతో.. బలవంతంగా అలా...

వద్దు వదిలేయ్ అని చెప్పినా వినలేదు..ఆ డైరెక్టర్ నాతో.. బలవంతంగా అలా ..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే అది ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. నేడు హీరోగా ఉన్న వాడు రేపు జీరో అవుతాడు. నేడు కత్తిలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ తరువాత రోజు ఆ అందం తో ఆకట్టుకోలేక పోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చాల మంది నటులు ఒక్కప్పుడు సినిమాలో చేసి ఇప్పుడు అక్కడ ఆఫర్స్ లేక్ సీరియల్స్ లో చేస్తుండడం మనం చూస్తున్నాం. ఇక అలాంటి వారందరికి కూడా బుల్లితెర పై సక్సెస్ వస్తుందా అంటే రాదనే చెప్పాలి. వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక అలాంటి వారిలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రాశి కూడా ఉన్నారు.

ఒక్కప్పుడు వెండి తెరను తన అందంతో ఓ ఊపు ఊపేసిన ఈ బొద్దుగుమ్మ..ఇప్పుడు టివి సీరియల్ లో కనిపిస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యింది. అందుకే చాలామంది వెండితెరనుంచి బుల్లితెరకు షిఫ్ట్ అవుతున్నారు. రాశి విషయానికి వస్తే..బాలనటిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి, మీనాల తర్వాత రాశి అని చెప్పవచ్చు.

ఈ సొట్టబుగ్గల సుందరి 1990వ దశకంలో అబ్బాయిల కలల సుందరి. చిరు నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ అచ్చ తెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది చిన్నది.

ఇక యుట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది రాశి. ఈ క్రమంలోనే రాశికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. తేజ డైరెక్షన్ లో మ‌హేష్‌బాబు హీరోగా వ‌చ్చిన “నిజం” అనే సినిమాలో రశి చాలా బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో విల‌న్‌గా చేసిన గోపీచంద్ కీప్ పాత్ర‌లో న‌టించిన రాశీని చూసిన వారు వామ్మో ఇంత బోల్డ్ ఏంట్రా.. అస‌లు క్యారెక్ట‌ర్ ప‌చ్చిగా ఉంద‌నే పెద‌వి విరిచారు. రాశీ నుంచి ఇలాంటి క్యారెక్ట‌ర్ ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

అయితే దీని పై క్లారిటీ ఇస్తూ రాశి.. అసలు నిజాలు చెప్పుకొచ్చింది. తనకు సినిమా కధ చెప్పేటప్పుడు డైరెక్టర్ తేజ ఒకాలా చెప్పారట. కానీ షూట్ చేసేటప్పుడు మరోలా చేసాడని..దీంతో ఆమెకు నచ్చక ఈ క్యారెక్టర్ నేను చేయను అని షూట్ నుండి వెళ్ళిపోతున్నప్పుడు తేజ మేనేజర్ ఆమెను ఈ రోల్ ఎలాగైన మీరు చేయాల్సిందే అంటూ బలవంతం చేసాడని చెప్పుకొచారు. సినిమా ఒప్పుకున్న తర్వాత నేను చేయను అంటే ఇండస్ట్రీలో చెడ్డపేరు వస్తుందని రాశిని బలవంతం చేసి ఒప్పించాడట తేజ మెనేజర్. దీంతో ఆ పాత్ర ఇష్టం లేకున్నా రాశి అయిష్టంగానే చేసిందట. కానీ చెడ్డ పేరు మాత్రం తెచ్చుకునింది. ఇక ఇప్పుడు రాశీ సెకండ్ ఇన్సింగ్స్‌లో అత్త పాత్ర‌లు చేస్తూ బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news