Moviesఅనుష్కను ప్రభాస్ దూరం పెట్టడానికి కారణం ఇదేనా..?

అనుష్కను ప్రభాస్ దూరం పెట్టడానికి కారణం ఇదేనా..?

ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ రూమర్ ఏదైన ఉంది అంటే అది ప్రభాస్-అనుష్క పెళ్లి మ్యాటర్. వీళ్ల జోడీ బాగుంటుంది. తెర పై వీళ్ల కెమిస్ట్రీ బాగా పండుతుంది. అభిమానులకు వీళ్ల జంట అంటే పిచ్చ ఇష్టం. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారితే చూడాని అభిమానులతో పాటు..టాప్ సెలబ్రిటీ కూడా చూస్తున్నారు.

వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు. గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి.. పైగా మూడు సినిమాలు కలిసి చేసారు.. ఐదేళ్లు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేసారు కాబట్టి ఇవన్నీ కామన్ అంటున్నారు వాళ్లు.

కాగా గత కొంత కాలంగా అనుష్క-ప్రభాస్ దూరంగా ఉంటున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ అయితే అనుష్క టాపిక్ తన దగ్గర్లో లేకుండా ఉంటున్నాడని.. అలాగే ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే అనుష్క వస్తుందా లేదా అని ఆరాలు తీసి.. ఆమె రాదు అంటేనే ప్రభాస్ వెళ్తున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి కారణం కృష్ణం రాజు నే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో ప్రభాస్ ని కలిసిన అనుష్క..ఆయనను కృష్ణం రాజు ఫ్యామిలీ అందరి ముందు గట్టిగా హగ్ చేసుకుని..క్లోజ్ గా మూవ్ అయ్యిందట.

జనరల్ గా సినీ ఇండస్ట్రీలో అలా హగ్ చేసుకోవడం కామన్ నే. కానీ అది ఫ్యామిలీ ఫంక్షన్ అయ్యే సరికి కృష్ణం రాజు కు కోపం వచ్చిందట. దీంతో ఇంకోసారి ఇలా చేయకు అంటూ గట్టిగానే చెప్పారట. దీంతో అప్పటి నుండి అనుష్క ప్రభాస్ తో దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్, అనుష్కల స్నేహం ఎంతో పవిత్రంగా కొనసాగుతోంది. ఎవరు ఏమనుకున్నా సరే.. దానికి ధీటైన సమాధానం చెబుతూ జాగ్రత్తగా తమ ఫ్రెండ్ షిప్ ను కాపాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news