Moviesప్ర‌భాస్ ఆతిథ్యం ఇంతమంది స్టార్ హీరోయిన్లు రుచి చూశారా...!

ప్ర‌భాస్ ఆతిథ్యం ఇంతమంది స్టార్ హీరోయిన్లు రుచి చూశారా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. బాహుబలి 1,2- సాహో సినిమాల‌తో ప్రభాస్ మార్కెట్ ఇపుడు బాలీవుడ్ ను మించిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆదిపురుష్‌ – రాధేశ్యామ్ – ప్రాజెక్ట్ కే – స‌లార్ సినిమాలు అన్నీ కూడా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా అయిపోయాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లకు ఒక రేంజ్‌లో ఆతిథ్యం ఇచ్చే ఆనందపడుతూ ఉంటాడట.

ప్రభాస్ హీరోయిన్లను భోజనానికి పిలిస్తే అది ఒక ఉత్సవంగా ఉంటుందట. ఈ విషయాన్ని గతంలో కొంతమంది హీరోయిన్లు కూడా చెప్పారు. తాజాగా ప్రాజెక్ట్ కే షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ఫెస్టివల్ ఫోటో షేర్ చేసింది. గతంలో కూడా ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన హీరోయిన్లు కూడా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ కు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వారి సరసన దీపిక చేరింది. ప్ర‌భాస్ ఆతిథ్యం అందుకున్న ఆ హీరోయిన్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం.

శ్ర‌ద్ధా క‌పూర్‌:
సాహో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరోయిన్ శ్రద్ధ కపూర్‌కు ప్రభాస్ ఆమె లైఫ్‌లో మర్చిపోలేని విందు ఇచ్చాడట. 25 రకాల వంటకాలతో ఉన్న ఫోటోను కూడా అప్పుడు శ్రద్ధాకపూర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వంటకాలు అదిరిపోయాయ‌ని ఆమె మెచ్చుకుంది.

భాగ్య శ్రీ:
ఇక ప్రేమ పావురాలు సినిమాతో దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీకి ప్రభాస్ కాకినాడ పూత రేకుల‌ డబ్బాలను ప్రత్యేకంగా అందించి ఆమెను సర్ప్రైజ్ చేశాడు. భాగ్యశ్రీ ఈ పూత రేకుల డ‌బ్బాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి డార్లింగ్ నన్ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటున్నాడంటూ ట్వీట్ చేసింది.

పూజా హెగ్డే:
ప్రభాస్ రాధే శ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ప్రభాస్ పంపించిన బిర్యాని అదిరిపోయింది అని మెచ్చుకుంది.

శృతీహాస‌న్‌:
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ స‌లార్‌ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హీరోయిన్ శృతి హసన్‌కు కూడా ప్రభాస్ ఫుడ్ ఫెస్టివల్ ఇచ్చాడట. ప్రభాస్ పంపిన ఆమెకు పంపిన ఫుడ్ ఐటెంల ఫోటోలు షేర్ చేసిన శృతి మన డార్లింగ్‌ను ఆకాశానికి ఎత్తేసింది.

సైఫ్ ఆలీఖాన్‌:
ప్రభాస్ కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఇలాంటి విందు ఇచ్చాడట. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సైఫ్ ఆలీఖాన్‌కు 25 ర‌కాల ఫైడ్ ఐటెంలు పంపించాడట. ఈ విషయాన్ని సైఫ్ భార్య క‌రీనా క‌పూర్‌ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

ర‌వీనా టాండ‌న్‌:
ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ సైతం ఒకసారి ప్రభాస్ పంపించిన ఫుడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ర‌వీనా భర్త అనిల్ థ‌డానీ ప్రభాస్ సినిమాల‌ను బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news