Moviesఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..!!

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..!!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటినీ చుట్టేస్తోంది.

ప్రతీ భాషలో ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తోంది. మీడియాతో ముచ్చటిస్తూ, వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తోంది. ఇక ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ని బెంగళూరులో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య మరియు రాజమౌళి హాజరు అయ్యారు.

ముంబైలో RRR యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అక్కడి మీడియాతో ముచ్చటించింది. ఆ తరువాత బెంగళూరు, చెన్నై అంటూ అటూ ఇటూ తిరుగుతోంది. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ముంబై చెన్నై లో కూడా వరుస ప్రమోషన్స్ చేశారు. అయితే తారక్ చేతిలో ఉన్న ఒక గడియారం ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలే ఎన్టీఆర్‌కు కాస్ట్ లీ కార్లు అన్నా ఇలాంటి స్పెసల్ వాచీలన్నా కూడా ఎంతో మక్కువ. అలా ఎన్టీఆర్ ప్రస్తుతం ధరించిన గడియారం గురించి వెదుకులాట ప్రారంభమైంది. దీంతో ఒక్కొక్కొరు వాచ్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. దాని ధర ఎంత అయి ఉంటుందని కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ఈ ధర చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ధరించిన రిచర్డ్ మిల్లీ ఆర్‌ఎమ్ 11 వాచ్ ధర ఏకంగా రూ. 39,932,935. అంటే దాదాపు రూ.4 కోట్లని చెప్పవచ్చు. ఇలాంటివి తారక్ దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. ఈ డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టేసుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news