Moviesఆ సినిమా కోసం కేవలం వంద రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకున్న...

ఆ సినిమా కోసం కేవలం వంద రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకున్న బన్నీ..!!

బన్నీ..అల్లు వారి అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. ఆ బ్రాండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంత ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. మనలో టాలెంట్ లేకపోతే.. ఇక్కడ ఈ రంగంలో నిలబడలేరు. మేన మామ పేరు చెప్పుకుని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన సొంత టాలెంట్ తో.. తన నటనతో.. డ్యాన్స్ తో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈయన నీ అభిమానులు ముద్దుగా బన్నీ అంటు పిలుచుకుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. పాన్‌ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు.

 

చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన బన్నీ..ఆ తరువత ఫుల్ హీరోగా గంగోత్రి అనే సినిమాతో టాలీవుడ్ లో తన ప్లేస్ కంఫార్మ్ చేసుకున్నాడు.అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య, బన్నీ, దేశముదురు, ఆర్య 2, వేదం ,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురం లో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో స్థానానికి చేరుకున్నాడు. ఇక అల వైకుంఠపురం తో తానంటే ఏంటో మళ్లీ రుజువు చేసుకున్నాడి ఈ స్టైలీష్ స్టార్. ఇక బన్నీ డ్యాన్స్ అంటే తెలుగు యువత ఎంత పిచ్చెక్కిపోయి ఉంటుందో చెప్పక్కర్లేదు. కాగా ఇప్పుడు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బన్నీ తన మొదటి సినిమాకి పారితోషకం ఎంత తీసుకున్నాడో తెలుసా..

చిరంజీవి హీరో గా నటించిన డాడీ సినిమాలో ఓ డ్యాన్స్ స్టూడెంట్ గా కనిపించిన బన్నీ తన డ్యాన్స్ తో అందరిని ఆకర్షించాడు. అప్పట్లో నే ఆయన డ్యాన్స్ కు మెచ్చి రాఘవేంద్రరావు అతనికి వంద రూపాయల పారితోషకం కూడా అందించారు. మొదటిసారి డాడీ సినిమాలో నటించినందుకు గాను వంద రూపాయల రెమ్యూనరేషన్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వం లోనే మొదటి సారి గంగోత్రి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అల్లు అర్జున్..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news