Moviesశ్రీదేవి కారణంగా చిరంజీవి ఇన్ని ఇబ్బందులు పడ్డారా..?

శ్రీదేవి కారణంగా చిరంజీవి ఇన్ని ఇబ్బందులు పడ్డారా..?

మెగాస్టార్ చిరంజీవి..టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరో. టాలీవుడ్ కి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకేఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.

ఇక తెర పై చిరంజీవి ఎందరో హీరోయిన్స్ తో నటించారు. వాళ్లలో కొందరు మాత్రం ఆయనతో వరుస గా జోడి కడుతూ..క్రేజీ పైర్ గా నిలిచారు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. శ్రీదేవి-చిరంజీవి జంట. వీళ్లిద్దరు జంట గా తెర పై కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని నమ్ముతారు దర్శక నిర్మాతలు. అంతలా అందరిని ఆకట్టుకుంటుంది ఈ జంట. చిరంజీవి-శ్రీదేవి జంట అంటే అభిమానులకు అదో రకమైన అభిమానం.

అయితే, కెరీర్ మొదట్లో శ్రీదేవి చాలా మొండిగా ఉండేదట. ఆమె దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు చుక్కలు చూయించేదట. సినిమాలో ఆమెకే ఇంపార్ టెన్స్ ఉండేలా కధను మార్చమనేదట. ఇలాగే ఓ సారి కోదండరామిరెడ్డి వజ్రాల దొంగ అనే సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసి.. ఆ సినిమాలో శ్రీదేవి, చిరంజీవిని జంటగా అనుకుని కొన్ని సీన్లు అనుకున్నారట.

కానీ శ్రీదేవి తన పాత్ర హైలెట్ చేయాలని కండీషన్ పెట్టారట. దీంత్ఫో మెగాస్టార్ చిరంజీవిని తక్కువ చేసి చూపించడం ఇష్టంలేక దర్శకుడు ఈ సినిమాని పూర్తిగా క్యాన్సిల్ చేశారట. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ సినిమా ఒక్కటే కాదు చాలా సినిమాల కధల విషయంలో ఇలానే చేసిందట. నాగార్జున తో కూడా ఒక్క సినిమా విషయంలో ఇలానే చేసి..సినిమాను క్యాన్సిల్ చేసుకుందట శ్రీదేవి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news