Movies"అఖండ”లో విలన్ గా నటించిన ఈయన సినిమాల కోసం ఎంత పెద్ద...

“అఖండ”లో విలన్ గా నటించిన ఈయన సినిమాల కోసం ఎంత పెద్ద త్యాగం చేసారో తెలుసా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ‌ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ జాతరకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రు. 100 కోట్ల షేర్ కొల్లగొట్టిన అఖండ .. పుష్ప సినిమా వచ్చేవరకు బాక్సాఫీస్‌ను దున్నేయ‌నుంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అఖండ టాపిక్ నడుస్తోంది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక అఖండ హిట్ తో హ్యాట్రిక్ కొట్టారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బోయపాటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. విలన్ పాత్రలు కూడా సమానంగా పవర్‌ఫుల్‌గా, బలంగా ఉంటాయి. అలాగే అఖండలో కూడా బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్‌ను పెట్టారు బోయపాటి. ఈ మూవీలో ఇక శ్రీకాంత్‌తో పాటు మరో విలన్‌గా నితిన్ మెహ‌తా నటించారు.

అయితే ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది మాత్రం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నితిన్ మెహతా. ఇంతకుముందు భారత సైన్యంలో 21 సంవత్సరాల పాటు సేవలు అందించిన నితిన్ మెహతా కు ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని కలలు కన్నారు. దీని కోసం ఆయన యూనిఫామ్​ను తీసేసి.. సినిమారంగంవైపు అడుగులేశారు. అలా బాలీవుడ్​లో కాబిల్​, భూమి వంటి సినమాలో ఛాన్స్ దక్కంచుకున్నారు. సౌత్​లోనూ రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ, అఖండ సినిమా మాత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఇక మరోవైపు ఆహా లో వస్తున్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోను హోస్ట్ చేస్తున్న బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రానున్న తన తర్వాత సినిమాకు కూడా రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా చేస్తోంది. మ‌రో పాత్ర‌కు ల‌క్ష్మీరాయ్‌ను ఎంపిక చేశార‌ని స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news