Moviesవామ్మో..పుష్ప పార్ట్ 1 కే అనసూయ అంత తీసుకుందా..?

వామ్మో..పుష్ప పార్ట్ 1 కే అనసూయ అంత తీసుకుందా..?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతలా వెయిట్ చేసారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫైనల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. రెండు భాగాలుగా భారీ రేంజ్‌లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు. దీంతో పుష్ప ప్రీమియర్ షోస్ భారీ ఆదరణ దక్కించుకున్నాయి. అభిమానులో అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సుకుమార్ సినిమాలోని ప్రతి సీన్ ను అధ్భుతంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన పుష్ప‌ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా స్లో గా సాగినప్పటికి బన్నీ పర్ ఫామెన్స్ తో అదరగొట్టేసారు. ఇక సమంత ,రష్మిక అందం సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి.

సినిమా పరంగా చూసుకున్నట్లైతే ఇది ఒక్క ఢిఫరెంట్ స్టోరీ. బన్నీలోని మరో యాంగిల్ ఈ సినిమాలో మనం క్లీయర్ గా చూడచ్చు. ఇక ఈ సినిమాలో అనసూయా పాత్ర గురించి ఎంతో ఊహించుకుని ధియేటర్స్ కు వెళ్ళిన జనాలను నిరాశ పరిచాడు సుకుమార్. అనసూయ లుక్ పరంగా భయపెట్టినా అసలు కధలో ఆమెకు స్క్రీన్ స్పేస్ లేదు. మంగళం సీను భార్య గానే సినిమాలో కనిపించింది కానీ..ద్రాక్షాయణీగా అసలు ఆమె అపీరియన్స్ నే లేదు. పుష్ప పార్ట్ 1 లో పెద్దగా కధ లేని అనసూయాకు..రెండో భాగంలో మాత్రం అద్దిరిపోయే సీన్స్ రాసుకున్నారట సుకుమార్. ఒకానోక సమయంలో అల్లు అర్జున తో పోటీ పడీ.. తన తమ్ముడిని చంపినందుకు..కడుపుతో ఉన్న పుష్ప భార్య శ్రీవల్లిని చంపేస్తుందట అనసూయ .

అప్పుడు బన్నీకి అనసూయకి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఓ రేంజ్ లో రాసుకున్నాడట డైరెక్టర్. ఇక పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరీ నుండి ప్రారంభం కానున్నట్లు ఇదివరకె సుక్కు క్లారిటీ ఇచ్చాడు. ఇక పుష్ప సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. నిజానికి ఈ సినిమాలో ఏం చేయని అనసూయ కు అంత ఇవ్వడం గొప్ప విషయమే అంటున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news