Moviesచిరంజీవికి చెల్లిగా సీనియ‌ర్ హీరోయిన్‌.. ఎవ్వ‌రూ ఊహించ‌రే...!

చిరంజీవికి చెల్లిగా సీనియ‌ర్ హీరోయిన్‌.. ఎవ్వ‌రూ ఊహించ‌రే…!

మెగాస్టార్ చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ తో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా వెండి తెర‌ను షేక్ చేసేస్తున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు .. ఆ సినిమా రీమేక్ అయినా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు. ఖైదీ నెంబ‌ర్ 150 ఏకంగా రు. 100 కోట్ల షేర్‌తో చిరుకు ఈ వ‌య‌స్సులోనూ ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌లేద‌న్న విష‌యం ఫ్రూవ్ చేసింది. మ‌రోవైపు చిరు త‌రం సీనియ‌ర్ హీరోల మార్కెట్ పూర్తిగా త‌గ్గిపోయింది. అయినా చిరు మాత్రం కుర్ర హీరోల‌కే షాక్ ఇస్తూ వ‌సూళ్లు సాధిస్తున్నారు. చిరు న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కు తేక‌పోయినా మాత్రం భారీ ఓపెనింగ్స్‌తో పాటు భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇక ఇప్పుడు ఆచార్య చేస్తోన్న చిరు ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి యువ ద‌ర్శ‌కుల‌తో క్రేజీ కాంబినేష‌న్ల‌ను సెట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆచార్య త‌ర్వాత వాల్తేరు వీర‌య్య‌, గాడ్ ఫాద‌ర్‌, సినిమాలు ఉన్నాయి. ఇక మ‌ళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్ రీమేక్‌ను తెలుగులో గాడ్ ఫాద‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ఉంద‌ట‌.

ఈ రోల్లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి వెండితెర‌పై ఎన్నో సినిమాల్లో జంట‌గా న‌టించారు. అవ‌న్నీ సూప‌ర్ హిట్లే. అల్లుడా మజాకా – ముగ్గురు మొనగాళ్లు – ఇద్దరు మిత్రులు సినిమాల్లో ర‌మ్య – చిరు క‌లిసి న‌టించారు. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ చిరు – ర‌మ్య క‌లిసి న‌టించ‌బోతున్నారు. అది కూడా అన్నా చెళ్లెల్లుగా కావ‌డంతో ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఈ సినిమాలో చిరుకు జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక స‌త్య‌దేవ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్‌రోల్ చేస్తున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news