Moviesరాజ‌మౌళి - మ‌హేష్ సినిమాపై మైండ్ పోయే అప్‌డేట్‌.. విల‌న్‌గా స్టార్...

రాజ‌మౌళి – మ‌హేష్ సినిమాపై మైండ్ పోయే అప్‌డేట్‌.. విల‌న్‌గా స్టార్ హీరో…!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసమే రాజమౌళి అహర్నిశలు కష్ట పడుతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో చేసే సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తర్వాత సినిమా మహేష్ బాబు తో ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్‌.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి టాప్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ప‌వ‌ర్ ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కథపై చాలా వరకు పూర్తి అయినట్టు గా కూడా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమా స్టైల్ లో ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇక రాజ‌మౌళి కూడా మ‌హేష్‌తో చేసే సినిమా జేమ్స్‌బాండ్ సినిమాల స్టైల్లో ఉంటుంద‌ని హింట్లు ఇస్తున్నారు.

ఈ సినిమా గురించి అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఈ సినిమాలో విల‌న్ రోల్ చేస్తే బాగుంటుందని రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విక్రమ్ ఒక పాత్ర కోసం ఎన్ని సంవత్సరాలు అయినా కష్టపడతారు. అపరిచితుడు – ఐ సినిమాలు చూస్తేనే విక్రమ్ కష్టం తెర మీద కనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా విక్రమ్ అయితే విల‌న్ క్యారెక్ట‌ర్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని విజయేంద్రప్రసాద్ – రాజమౌళి ఇద్దరు భావించినట్లు తెలుస్తోంది.

ఇక విక్రమ్ కూడా రాజమౌళి అడిగితే ఆయన సినిమాలో నటించేందుకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు. ఏదైనా ఈ క్రేజీ కాంబినేషన్ పై అదిరిపోయే అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news