Moviesక‌ళ్యాణ్‌రామ్ ' బింబిసార ' టీజ‌ర్‌.. మ‌రీ ఇంత క్రూరంగానా.. (...

క‌ళ్యాణ్‌రామ్ ‘ బింబిసార ‘ టీజ‌ర్‌.. మ‌రీ ఇంత క్రూరంగానా.. ( వీడియో)

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న తాజా సినిమా బింబిసార‌. ఈ సినిమా టీజ‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇక సినిమా టీజ‌ర్ చూస్తుంటే క‌ళ్యాణ్‌రామ్ క్రూర‌మైన బార్బేరియ‌న్ కింగ్‌గా కినిపిస్తున్నాడు. గ‌తంలో రెండు జ‌న్మ‌ల నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో మ‌గ‌ధీర చాలా స్పెష‌ల్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు తెలుగు సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది.

ఇక ఇప్పుడు బింబిసార టీజ‌ర్ చూస్తుంటే అదే స్టైల్లో ఉంద‌ని చెప్పాలి. చ‌రిత్ర‌లో ఉన్న ఓ క‌థ‌కు, వ‌ర్త‌మాన కాలంలో ఉన్న క‌థ‌కు లింక్ పెడుతూ క‌థ అల్లుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అశోక చ‌క్ర‌వ‌ర్తి తాత బింబుసారుడి వ్య‌వ‌హారానికి, వ‌ర్త‌మానంలో మ‌ళ్లీ జ‌న్మించ‌డానికి మ‌ధ్య ఏదో ముడి వేస్తూ అల్లుకున్న‌ట్టుగా ఈ సినిమా క‌థ ఉంద‌ని టీజ‌ర్ సంకేతాలు ఇస్తోంది.

ఇక సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ట్టుగా టీజ‌ర్‌లో విజువ‌ల్స్ చెప్పేస్తున్నాయి. క‌ళ్యాణ్‌రామ్ బింబిసారుడిగా.. క్రూర‌మైన లుక్‌లో క‌నిపిస్తున్నాడు. క‌ళ్యాణ్‌రామ్ బేస్ వాయిస్‌లో చెప్పిన డైలాగులు అదిరిపోతున్నాయి.ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గాన్ని చూసి తల వంచి బానిసలు అయితే.. ఆ భాయ‌న్ని చూస్తూ ఓ రాజ్యం మీసం మెలేస్తుంది.. అదే త్రిగ‌ర్త‌ల సామ్రాజ్య‌పు నెత్తిటి సంత‌కం.. అదే బింబిసారుడి ఏక‌చ‌క్రాధిప‌త్యం అంటూ వాయిస్ ఓవ‌ర్‌తో వ‌చ్చిన టీజ‌ర్ అయితే భ‌యంక‌ర‌మైన ఎక్స్‌పెక్టేష‌న్స్ ఇచ్చేసింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. కేథరీన్ ట్రెసా – సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news