MoviesR R R ట్రైల‌ర్ డ్యురేష‌న్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

R R R ట్రైల‌ర్ డ్యురేష‌న్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను ఎలా పెంచేశాయో చూస్తూనే ఉన్నాం. రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తుండడంతో పాటు రాజ‌మౌళి లాంటి నేష‌న‌ల్ క్రేజీ డైరెక్ట‌ర్ బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో సినిమా ప్రి రిలీజ్ బ‌జ్ హీటెక్కించేస్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్లు భారీ ఎత్తున చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కు వ‌చ్చిన క్రేజ్‌ను కూడా క్యాష్ చేసుకుని.. ప్ర‌భాస్‌తో నార్త్‌లో ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్లు చేయించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఎంతో ఆస‌క్తితో అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ట్రైల‌ర్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆర్ ఆర్ ఆర్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ రెండో వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైల‌ర్ డ్యురేష‌న్ మూడు నిమిషాల‌కు పైగానే ఉండేలా క‌ట్ చేస్తున్నార‌ట‌. రాజ‌మౌళి స్ట్రాట‌జీ ప్లాన్ ప్ర‌కార‌మే సినిమాపై ఆకాశంలో అంచ‌నాలు ఉండేలా.. మూడు నిమిషాల‌కు పైగా ఉండేలా ట్రైల‌ర్ క‌ట్ చేస్తున్నార‌ట‌.

బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రియా చ‌ర‌ణ్‌, బ్రిట‌న్ మోడ‌ల్ ఒలివీయా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌గా.. సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు అందిస్తున్నారు. కెకె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news