Moviesబాల‌య్య దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా.. దుమ్మ‌రేపిన అన్‌స్టాప్‌బుల్ ప్రోమో (వీడియో)

బాల‌య్య దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా.. దుమ్మ‌రేపిన అన్‌స్టాప్‌బుల్ ప్రోమో (వీడియో)

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు వారి ఆహాలో ఓ టాక్ షో స్టార్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అన్‌స్టాప్‌బుల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ షోపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అటు అల్లు వారి ఓటీటీ.. ఇటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ కావ‌డంతో ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. ఇక మ‌రో టాక్ ప్ర‌కారం క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఈ షోకు తొలి గెస్ట్ అన్న టాక్ కూడా ఇప్ప‌టికే వ‌చ్చేసింది.

ఇదిలా ఉంటే ఈ రోజు ఈ టాక్ షో ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తుంటేనే దుమ్ము రేగిపోతోంది. బాల‌య్య ఓ వ‌ప‌ర్ ఫుల్ సింహంగా క‌నిపిస్తున్నాడు. ప్రోమో అంతా చాలా రిచ్‌గా ఉండ‌డంతో పాటు అదిరిపోయింది. బాల‌య్య బైక్ రైడింగ్ చేయ‌డం.. కారు, హార్స్ రైడింగ్ చూస్తూ కుర్రాడిలా ఉన్నాడు. బాల‌య్య లుక్ కూడా చాలా యంగ్ ఎన‌ర్జిటిక్‌గా ఉంది.

ప్రోమోలో బాల‌య్య నీకు చిత్త‌శుద్ధి ఉన్న‌ప్పుడు.. నీకు ల‌క్ష్య శుద్ధి ఉన్న‌ప్పుడు నీకు సంక‌ల్ప శుద్ధి ఉన్న‌ప్పుడు నిన్ను పంచ‌భూతాలు కూడా ఆప‌లేవు. మాట‌ర్లో ఫిల్డ‌ర్ ఉండ‌దు.. స‌ర‌దాలో స్టాప్ ఉండ‌దు.. సై అంటే సై… నై అంటే నై అని చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయింది. దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా ? క‌లుద్దాం ఆహాలో అని బాల‌య్య డైలాగ్ చెప్పాడు. మ‌రి ఈ షో తెలుగు బుల్లితెర‌పై ఎన్ని సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతుందో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news