Movies"రాధే శ్యామ్" వ్యూస్ తగ్గడానికి కారణం అదే..క్లారిటి ఇచ్చిన యూట్యూబ్‌ ..అభిమానులు...

“రాధే శ్యామ్” వ్యూస్ తగ్గడానికి కారణం అదే..క్లారిటి ఇచ్చిన యూట్యూబ్‌ ..అభిమానులు షాక్..!!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్‌ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది.

ఇక అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ టీజర్ రిలిజ్ చేసారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. అనీ నాకు తెలుసు..కానీ చెప్పను అంటూ ప్రభాస్ టీజర్ ద్వారానే సంచలనాలు క్రియేట్ చేసాడు. విడుదలైన టీజర్లో ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ సినిమాలో ‘విక్రమాదిత్య’ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.

అయితే ,ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ టీజర్ అత్యధిక వ్యూస్‌ సంపాదించి రికార్డు క్రియేట్‌ చేసి దూసుకుపోతోంది. కానీ ఓ విషయంలో అనుకోకుండా చిన్న సమస్య వచ్చింది. 63 మిలియన్‌గా ఉన్న వ్యూస్‌ ఒక్కసారిగా 62 మిలియన్లకి పడిపోయాయి. దీంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది గమనించిన నెటిజన్లు ఎందుకిలా జరిగింది అంటూ యూట్యూబ్‌ టీమ్‌కి ట్విటర్‌లో మేసేజ్‌ పెట్టారు. అభిమానుల ట్వీట్‌లకి స్పందించిన ఆ టీమ్‌ కారణాన్ని తెలియజేసింది. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది అని అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని క్లారిటీ ఇచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news