Moviesబాలీవుడ్ బ‌డా హీరోను ప‌ట్టేసిన టాలీవుడ్ హీరోయిన్‌.. భార్య‌కు విడాకులిప్పించే ప‌నిలో...

బాలీవుడ్ బ‌డా హీరోను ప‌ట్టేసిన టాలీవుడ్ హీరోయిన్‌.. భార్య‌కు విడాకులిప్పించే ప‌నిలో బిజీ…!

సినిమా రంగం అనేది ఓ మాయా ప్ర‌పంచం. ఇక్క‌డ ఆక‌ర్ష‌ణ‌లు చాలా త్వ‌ర‌గా అతుక్కుంటాయి. అంతే త్వ‌ర‌గా విక‌ర్షించుకుంటాయి. అస‌లు ఈ సినిమా ప్ర‌పంచంలో ఉన్న వాళ్లు దాంప‌త్య జీవితానికి ఏ మాత్రం విలువ ఇవ్వ‌రు. బాలీవుడ్‌లోనే మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉన్న అమీర్‌ఖాన్ త‌న రెండో భార్య కిర‌ణ్ రావుకు విడాకులు ఇవ్వ‌డం కూడా చాలా మందికి షాక్ ఇచ్చింది.

అతెందుకు ఎంతో అన్యోన్యంగా ఉన్న నాగ‌చైత‌న్య – స‌మంత విడాకులు కూడా ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. ఇక చాలా మంది హోదాతో పాటు డ‌బ్బు కోసం అడ్డ‌దారులు తొక్కుతుంటారు. మ‌రి కొంద‌రు అయితే స్టార్ హోదాలో ఉన్న వారిని ఏదోలా ఒల‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా ఓ బాలీవుడ్ హీరోను వ‌ల‌లో వేసుకునేందుకు ప్లాన్ వేస్తోంద‌న్న గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ అమ్మడు ఆ హీరోకు ద‌గ్గ‌ర‌య్యేందుకు అత‌డి ఫ్యామిలీలోనే చిచ్చు పెట్టింద‌ని అంటున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు స్టార్ హీరోల‌తో న‌టించి కుర్రాళ్ల మ‌న‌స్సుల‌ను ఫిదా చేసింది. ఇక ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక ఎన్నో బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేసింది. త‌క్కువ టైంలోనే టాప్ బిజినెస్ వుమెన్‌గా పేరు తెచ్చుకుంది.

అయితే బాలీవుడ్‌ను టార్గెట్ చేసిన ఈ అమ్మ‌డు అక్క‌డ స్టార్ హీరోతో ప‌రిచ‌యం పెంచుకుంది. ఈ క్ర‌మంలోనే అత‌డి ద్వారా మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌చ్చ‌ని డిసైడ్ అయిన ఈ భామ ఇప్పుడు ఏకంగా అత‌డిని భార్య‌కు దూరం చేసి.. ఈ ప్లేస్‌లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news