Moviesస‌మంత - చైతు విడాకుల విష‌యంలో వీళ్లు బ‌ల‌య్యారుగా...!

స‌మంత – చైతు విడాకుల విష‌యంలో వీళ్లు బ‌ల‌య్యారుగా…!

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ముగిసింది. వీరు విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌దు కాని.. వీరు విడాకుల వ్య‌వ‌హారంలో కొంద‌రు తోటి న‌టుల పేర్లు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు లాగి వారిని కూడా బ‌లి చేశారు. చైతు తాజాగా ల‌వ్ స్టోరీ సినిమా చేశాడు. ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఈ సినిమాల‌తో త‌న‌తో పాటు న‌టించిన సాయిప‌ల్ల‌వితో బాగా క‌నెక్ట్ అయ్యాడ‌ని.. వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. ఆమెను పెళ్లి చేసుకునేందుకే స‌మంత‌కు విడాకులు ఇచ్చాడ‌న్న ప్ర‌చారం ఒక‌టి మొద‌లైంది.

ఇక ఈ విడాకుల‌కు బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ మాత్రం అమీర్ వ‌ల్లే చైతు స‌మంత‌కు విడాకులు ఇచ్చాడంటూ బాంబు పేల్చింది. ఓ సౌత్ స్టార్ ఇటీవ‌ల బాలీవుడ్‌లో విడాకుల స్పెష‌లిస్ట్‌గా పేరున్న స్టార్ హీరోతో క‌లిసి ఓ సినిమా చేశాడు. ఆ వెంట‌నే త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడంటూ ఆడి పోసుకుంది.

ఇక కోలీవుడ్ క్రేజీ హీరో ర‌జ‌నీ కాంత్ అల్లుడు ధ‌నుష్‌తో సినిమా చేసేందుకే స‌మంత చైతుకు విడాకులు ఇచ్చింద‌ని కూడా అంటున్నారు. ఇక స‌మంత త‌న ప‌ర్స‌న‌ల్ స్టైలీస్ట్ ప్రీత‌మ్ జువాల్క‌ర్‌తో ప్రేమ‌లో ఉంద‌ని.. అత‌డిని పెళ్లాడేందుకు చైతుకు దూర‌మైంద‌ని ఇలా ర‌క‌ర‌కాలగా చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు ఇందులో ఎవ‌రికి అయినా ఈ విడాకుల‌తో సంబంధం ఉందో లేదో ? కాని వారి పేర్లు మాత్రం బ‌య‌ట‌కు లాగేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news