Movies40 ఏళ్ల‌కు త‌ల్లి అయిన హాట్ హీరోయిన్‌...

40 ఏళ్ల‌కు త‌ల్లి అయిన హాట్ హీరోయిన్‌…

బాలీవుడ్‌ ప్రముఖ నటి, హాట్ యాంకర్ నేహా ధూపియా గురించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగానే కెరీర్ ఆరంభించారు. మిన్నారం ఆమె తొలి సినిమా. ఆ త‌ర్వాత జ‌ప‌నీస్ సినిమాల్లోనూ న‌టించింది. 2000లో టాలీవుడ్‌లో త‌రుణ్ హీరోగా వ‌చ్చిన నిన్నే ఇష్ట‌ప‌డ్డాను సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె రాజ‌శేఖ‌ర్ తో కూడా మ‌రో సినిమాలో న‌టించింది. అప్ప‌ట్లో నేహ అందాల ఆర‌బోత‌కు యూత్‌లో మాంచి క్రేజ్ ఉండేది.

ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో యాంక‌ర్ అవ‌తారం ఎత్తి.. అక్క‌డ కూడా హాట్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఆమె 2018లో అంగ‌డ్ బేడీని ప్రేమ వివాహం చేసుకుంది. 2019లోనే ఈ జంట‌కు ఓ పాప పుట్టింది. ఇక తాజాగా ఇప్పుడు ఆమె మ‌రో బేబీకి జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని అంగ‌డ్ త‌న ఇన్‌స్టా ద్వారా తెలిపినా బేబీ ఫొటో మాత్రం రివీల్ చేయ‌లేదు.

ఇక నేహ ప్ర‌స్తుత వయ‌స్సు 40 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌స్సులో ఆమె రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో వావ్ నేహ అని ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇక ప‌లువురు నెటిజ‌న్లు ఆమెకు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెపుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by ANGAD BEDI (@angadbedi)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news